అడ్డంగా దొరికిపోయిన యాదమ్మ రాజు.. హ్యాండ్ బాగ్ ఎవరిదంటూ నిలదీసిన స్టెల్లా
on Sep 23, 2023

ఈ మధ్య ప్రాంక్ వీడియోస్ సోషల్ మీడియాలో మస్త్ వైరల్ అవుతున్నాయి. ఎవరికి వాళ్లకు యూట్యూబ్ ఛానల్స్ ఉండడంతో కంటెంట్ దొరకనప్పుడు ఇలాంటి ప్రాంక్ వీడియోస్ చేస్తూ వ్యూస్ ని లైక్స్ ని పెంచుకునే పనిలోనే ఉంటున్నారు చాల మంది. ఇప్పుడు యాదమ్మ రాజుతో స్టెల్లా, కమెడియన్ భాస్కర్ కలిసి అలాంటి ఒక ప్రాంక్ వీడియో చేశారు...ఇంట్లో ఆల్రెడీ యాదమ్మ రాజుకు తెలియని ఒక లేడీస్ హ్యాండ్ బాగ్ ని, ఒక స్కార్ఫ్ ని ఏర్పాటు చేసి ఫోన్ చేసి పిలిపించారు.
ఇక యాదమ్మరాజు ఇంటికి రాగానే స్టెల్లా, భాస్కర్ డ్రామా షురూ చేశారు. " ఈ బ్యాగ్ ఎవరిదీ...ఈ స్కార్ఫ్ ఎవరిదీ...నేను ఇంట్లో లేనప్పుడు ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి ఎవరు..అసలు ఇంట్లో నా వెనక ఎం జరుగుతోంది. పద మీ అమ్మను, మా అమ్మను కూర్చోబెట్టి పంచాయతీ పెట్టాల్సిందే... నేను అమెరికా వెళ్ళినప్పుడు ఇంకో అమ్మాయిని ఇంటికి తెచ్చావని తెలిసింది.
నన్ను లవ్ చేసి వేరే అమ్మాయిని తెచ్చుకుంటావా" అంటూ గట్టిగా అరిచేసరికి యాదమ్మ రాజు తనకేమీ తెలీదని చెప్తూనే స్టెల్లా మాటలకు కోపంతో కొట్టాడు. దానికి భాస్కర్ కూడా అడ్డుపడి "ఎందుకు ఇలా చేస్తున్నావ్ రాజన్న...నీ మీద చాలా గౌరవం ఉంది. నువ్వు అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి పనులు చేయొచ్చా" ఇంతకు ఎవరా అమ్మాయి" అని మళ్ళీ అడిగేసారికి యాదమ్మ రాజుకు కోపం నషాళానికి అంటడంతో భాస్కర్ తో పాటు ఆ పక్కనే ఉన్న ఇంకో వ్యక్తిని కొట్టేసాడు రాజు. దాంతో సీన్ రివర్స్ అయ్యేలా ఉందని తెలుసుకున్న స్టెల్లా రాజుని ఆపి ఇది ప్రాంక్ వీడియో అంటూ సర్ప్రైజ్ చేసింది. ఇక యాదమ్మ రాజు సైలెంట్ గా స్టెల్లా వైపు చూస్తూ ఉండిపోయాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



