మూడవ హౌజ్ మేట్ కోసం ప్రియాంక జైన్-శోభా శెట్టి మధ్య టాస్క్.. గెలుపెవరిది?
on Sep 23, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి మలుపు తిరుగుతుంది. టాస్క్ రోజుకొకరి చేతులు మారుతుంది. మొదట అమర్ దీప్, యావర్, శోభా శెట్టి మూడవ కంటెస్టెంట్ కోసం పోటీ పడగా.. అమర్ దీప్ ని గుండు చేసుకోమని, ప్రియాంక జైన్ ని బాల్ కట్ చేసుకోమని బిగ్ బాస్ కోరాడు. కానీ అమర్ దీప్ తన జట్టు తీసుకోడానికి ఒప్పుకోకపోవడంతో, ప్రియాంక జైన్ సిద్దమైంది. దాంతో అమర్ దీప్ రేస్ నుండి బయటకొచ్చేశాడు.
ఇక మూడవ కంటెస్టెంట్ కోసం పోటీ చేస్తున్న కంటెస్టెంట్స్ లో.. ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శోభాశెట్టి మిగిలారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు అన్ డిసర్వింగ్ అని మిగిలిన ఇద్దరు డిసైడ్ చేసి చెప్పాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ప్రియాంక జైన్ మొదట న్యూట్రల్ గా ఉంది. శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ల మధ్య నేనెందుకు అన్ డిసర్వింగ్ అని యావర్ అడుగగా.. నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ వి, ఒకవేళ ఏదైనా టాస్క్ పెడితే ప్రియాంక జైన్ అమ్మాయి కాబట్టి నేను గెలిచే ఛాన్స్ ఉందని యావర్ తో శోభా శెట్టి అంటుంది. దానికి యావర్ అన్ ఫేయిర్ అంటూ వాదనకి దిగితాడు. ఇక అప్పటిదాకా ఇద్దరు సమానమే అని చెప్పిన ప్రియాంక జైన్.. వెంటనే యావర్ ని రేస్ నుండి తప్పించాలనుకుంటున్నా అని అంటుంది. ఇక ప్రిన్స్ యావర్ ఫుల్ ఫ్రస్టేషన్ లో బిగ్ బాస్ ఇచ్చిన ప్రాపర్టీని నాశనం చేస్తాడు. ఇక అతని కోపాన్ని చూసిన మిగిలిన కంటెస్టెంట్స్ అంతా బయపడతారు. ఇక సంఛాలక్ గా ఉన్న ఆట సందీప్ యావర్ ని కూల్ చేస్తాడు.
ఇక మూడవ హౌజ్ మేట్ కోసం ప్రియాంక జైన్, శోభా శెట్టి మధ్య ఫైనల్ టాస్క్ జరుగుతుంది. ప్రాపర్టీ ఏరీయాలో తిరిగే బుల్ యంత్రాన్ని ఉంచాడు బిగ్ బాస్. దానిపై మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సమయం ఉండగలుగుతారో వారే విజేత అని బిగ్ బాస్ చెప్తాడు. ఇద్దరు టాస్క్ ఫినిష్ చేస్తారు. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సమయం ఉండి, మూడవ హౌజ్ మేట్ గా గెలిచారో తెలియాలంటే శనివారం జరిగే ఎపిసోడ్‌లో నాగార్జున చెప్తాడని బిగ్ బాస్ అంటాడు. ఇక ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు. మరి మూడవ హౌజ్ మేట్ గా ఎవరుంటారో తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
