అనసూయ, ఆది.. వారం వారం డిన్నర్‌కు వెళ్తారా?
on Dec 3, 2021
బుల్లితెరపై పాపులర్ అయిన జంటల్లో అనసూయ, ఆది ఒకటి. 'జబర్దస్త్'లో అనసూయ ప్రస్తావన లేకుండా ఆది స్కిట్ ఉండదు. తరచూ ఆమెను తన స్కిట్లలో భాగం చేస్తుంటాడు ఆది. ఎప్పటిలాగే రానున్న జబర్దస్త్ ఎపిసోడ్లో ఆది చేసిన స్కిట్ నవ్వుల పువ్వులను పూయించడం గ్యారంటీ. ఈసారి 'మహర్షి' మూవీలోని వ్యవసాయం కాన్సెప్ట్‌తో స్కిట్ చేశాడు ఆది.
"రైతుల వేళ్లు మట్టిలోకి వెళ్తేనే మన చేతి ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయండీ.. అందుకే రైతే రాజు అంటారు" అని చెప్పాడు ఆది. తోటి కమెడియన్ "మేం కూడా రైతులమేగా.. రైతే రాజని ఈయన ఒక్కడి పేరే చెప్తారేంటి?" అని అడిగాడు, రైజింగ్ రాజును చూపిస్తా. "రైతే రాజంటే రైజింగ్ రాజు కాదురా యెదవా.. నీలాంటోడే అనసూయ ఆదివారం డిన్నర్‌కు వెళ్తారని చెప్తే.. అనసూయ, ఆది.. వారం వారం డిన్నర్‌కు వెళ్తారని రాశాడంట." అని తన మార్క్ పంచ్ వేసేశాడు.
Also read: అనసూయ అడగాలే కానీ ఆది లిప్ లాక్ అయినా ఇచ్చేస్తాడు!
"నాలాంటి అందగత్తె దొరకాలనంటే కొండమీద కోతినైనా తెచ్చిచ్చేవాడిలా ఉండాలి" అని రీతు చౌదరి చెప్పగానే, "అయితే ముందు నువ్వు కొండమీదకు వెళ్లాలి" అని ఇంకో పంచ్ వేశాడు. దాంతో రీతు కూడా ఆ పంచ్‌లోని అర్థాన్ని గ్రహించి పొట్టచెక్కలయ్యేలా నవ్వేసింది. రోజా అయితే మనో మీద పడీ పడీ నవ్వింది.
Also read: స్టేజ్‌పై అందరూ చూస్తుండగా సుధీర్ గల్లపట్టి కన్ను కొట్టేసింది!
ఈ ఎపిసోడ్లో చలాకీ చంటి, రాఘవ ఒకే స్కిట్లో నవ్వులు పూయించనున్నారు. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొని పారిపోతే, "ఆయన స్కిట్ అనుకొని ఈయన పారిపోయాడు, ఈయన స్కిట్ అనుకొని ఆయన పారిపోయాడు" అని ఆ స్కిట్లోని కమెడియన్ చెప్పాడు. డిసెంబర్ 9న ఈ ఎపిసోడ్ మన ముందుకు రానున్నది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
