అనసూయ అడగాలే కానీ ఆది లిప్ లాక్ అయినా ఇచ్చేస్తాడు!
on Nov 29, 2021
'జబర్దస్త్'లో ఆది-అనసూయ జంట ఇటీవలి కాలంలో బాగా ఫేమస్ అయిపోయింది. ఇండివిడ్యువల్‌గా ఇద్దరికీ ఎవరి పాపులారిటీ వాళ్లకు ఉన్నా పెయిర్‌గా కూడా వాళ్లు వ్యూయర్స్‌ను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. డిసెంబర్ 2న ప్రసారం కానున్న జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఆ జోడీ మరోసారి హిలేరియస్‌గా నవ్వించనుంది. ఈ ఎపిసోడ్‌లో వ్యూయర్స్‌కు అనసూయ ఎక్స్‌పోజింగ్ అదనపు వినోదాన్ని ఇవ్వనుంది. అవును. కురుచ గౌనులో ఒకవైపు క్లీవేజ్, ఇంకోవైపు థైస్ చూపిస్తూ అనసూయ కనిపించిన తీరు మతులు పోగోట్టేలా ఉంది.
ఇక ఈ ఎపిసోడ్‌లో యాంకరింగ్‌తో పాటు ఆది స్కిట్‌లో తను కూడా భాగం పంచుకుంది అనసూయ. ఆ స్కిట్ ప్రకారం ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు. ఆది ఇంటి పక్కనే వాళ్ల ఇల్లు కూడా. ఆది 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ లెక్కన గెటప్ వేసుకొని, రంగు కళ్లద్దాలు పెట్టుకొని, "చూపే బంగారమాయెనే శ్రీవల్లీ.. మాటే మాణిక్యమాయెనే" పాటకు సిగ్నేచర్ స్టెప్ వేస్తూ ఉండగా, అనసూయ వచ్చి, "మా ఇంటి లాక్ పోయింది.. ఒక లాక్ ఇవ్వవా?" అని అడిగింది.
"అరే.. నువ్వడగాలే కానీ.." అని ఆది డైలాగ్ ఫినిష్ చేయకముందే, జడ్జి రోజా అందుకుని "లిప్ లాక్ అయినా ఇచ్చేస్తాడు" అని చెప్పారు. దాంతో నవ్వులే నవ్వులు.
Also read: స్టేజ్‌పై అందరూ చూస్తుండగా సుధీర్ గల్లపట్టి కన్ను కొట్టేసింది!
"నా చెల్లెళ్లనెవరైనా టచ్ చెయ్యాలంటే ముందు నన్ను టచ్ చెయ్యాలి తెల్సా?" అని చెప్పింది అనసూయ. ఆమె ఎందుకు ఆ మాట అందో తెలీదు కానీ, "నాక్కావాల్సింది కూడా అదే.. టచ్ చేస్తా." అని నవ్వుతూ అనసూయ దగ్గరకు వచ్చాడు ఆది. తను కూడా నవ్వుతూ అతడిని చేత్తో ఆపింది అనసూయ. సరసం మేళవించి ఇలా అనసూయ, ఆది చేసే స్కిట్లు వీక్షకులకు పసందుగా, రంజుగా అలరిస్తున్నాయని వేరే చెప్పాలా? వీళ్ల సరసాలు పూర్తిగా ఆస్వాదించాలంటే డిసెంబర్ 2న ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే..

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
