స్టేజ్‌పై అందరూ చూస్తుండగా సుధీర్ గల్లపట్టి కన్ను కొట్టేసింది!
on Nov 25, 2021
బుల్లితెర కామెడీ షో ఎక్స్‌ట్రా జబర్దస్త్. ఈ షో ద్వారా పాపులర్ అయిన జోడీ సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్. వీరిద్దరిపై వచ్చినన్ని పుకార్లు మరే జంటపై ఇప్పటి వరకు రాలేదు. అంతగా వార్తల్లో నిలిచారు. ఒక దశలో వీరి క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకున్న షో నిర్వాహకులు రోజా సాక్షిగా సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్‌లకు ఉత్తుత్తి పెళ్లి తంతుని కూడా నిర్వహించి ఔరా అనిపించారు. ఆ తరువాత నుంచి వీరిద్దరు త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
వీరిద్దరూ డ్యాన్స్ షో ఢీ -13లోనూ తమదైన రీతిలో ఎంటర్‌టైన్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు రిలీజ్ చేశారు. గణేష్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షోకి మంచు లక్ష్మి, సిద్ధు జొన్నలగడ్డ అతిథులుగా హాజరయ్యారు. ఈ షోలో టీమ్ లీడర్‌లుగా సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సుడిగాలి సుధార్‌పై మంచు లక్ష్మి కామెంట్‌లు చేయడం.. దానికి హైపర్ ఆది ఆజ్యం పోయడం నవ్వులు పూయిస్తోంది.
ఇక ఇదే వేదికపై `గుంటూర్ టాకీస్ 2` రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌తో చేస్తే ఎలావుంటుందని చిన్న స్కిట్ చేశారు. ఈ స్కిట్‌లో భాగంగా సుడిగాలి సుధీర్ గల్లపట్టి దగ్గరకు లాక్కుని కొంటెగా రష్మీ కన్ను కొట్టడంతో పూర్ణ, ప్రియమణి, గణేష్ మాస్టర్, మంచు లక్ష్మీ తదితరలు నోరెళ్లబెట్టేయడంతో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట టాప్ లో ట్రెండ్ అవుతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
