Guppedantha Manasu : ఆ క్రైమ్ నుండి అతను తప్పించుకున్నట్టేనా?
on Nov 29, 2023
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -932 లో.. వసుధార ఏ తప్పు చెయ్యలేదని రిషి నిరూపించాలని అనుకుంటాడు. మరొకవైపు హాస్పిటల్ లో చిత్ర లేదు. వీళ్ళే కిడ్నాప్ చేశారని చిత్ర పేరెంట్స్ అంటారు. మా కూతురు ఎక్కడ అని వాళ్ళు అనగానే చూపిస్తానంటూ మహేంద్రని రిషి పిలిచి.. చిత్రని తీసుకొని రమ్మని చెప్పగానే మహేంద్ర చిత్రని తీసుకొని రావడం చూసి అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు.
ఆ తర్వాత నువ్వు ఎవరికి బయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి ఈ వసుధార మేడమే కారణమా అని చిత్రని ఎస్సై అడుగగానే.. మేడమ్ కారణమని ఎవరు చెప్పారు. అసలు నేను సూసైడ్ చేసుకోలేదని చిత్ర అంటుంది. చిత్ర పేరెంట్స్ వీడియో కాల్ లో అక్కడ జరిగేదంతా చూస్తున్న దేవయాని వాళ్ళ గురించి ఎక్కడ బయటపడుతుందోనని టెన్షన్ పడుతుంటారు. ఆ తర్వాత ఎస్సై లెటర్ తీసుకొని చూపించగా నేను రాయలేదు. వాల్లే బలవంతంగా ఖాళీ పేపర్ పై సంతకం పెట్టించారని చిత్ర చెప్తుంది. అసలేం జరిగిందని, మొత్తం క్లారిటీ గా చెప్పమని ఎస్సై అనగానే.. చిత్ర జరిగింది మొత్తం చెప్తుంది. నా ఫోన్ నుండి మేడమ్ కి మెసేజ్ చేశారు కానీ మేడమ్ వచ్చి అక్కడ నాకు సపోర్ట్ గా మాట్లాడిందని, బెదిరించలేదని చెప్తుంది. ఆ తర్వాత సంతకం పెట్టించుకున్నారు. కొద్దిసేపటికి నా నోటి నుండి నూరగలు వచ్చాయని చిత్ర చెప్తుంది. అసలు వాళ్ళు నా పేరెంట్స్ కాదు. పిన్ని బాబాయ్ లు చిన్నప్పటి నుండి నన్ను టార్చర్ చేశారని చిత్ర అనగానే.. నా కూతురిని బెదిరించి ఇలా చెప్పిస్తున్నారని చిత్ర పేరెంట్స్ అని చెప్పుకుంటారు. ఆమె అనగానే రిషి తన దగ్గర ఉన్న చిత్రని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న అబ్బాయిని తీసుకొని వచ్చి.. నిజం చెప్పమంటాడు. ఆ తర్వాత అతన్ని ప్రేమించలేదు. వాళ్ళు నా పేరెంట్స్ కాదు పిన్ని బాబాయ్. వాళ్ళు చిన్నప్పటి నుండి టార్చర్ చేస్తున్నారని చిత్ర చెప్తుంది. మరొకవైపు ఎక్కడ శైలేంద్ర పేరు చెప్తాడోనని కంగారుగా శైలేంద్ర కి దేవయాని ఫోన్ చేస్తే కలవదు.
ఆ తర్వాత అతను జరిగింది చెప్తాడు. చిత్రని చంపాలనుకున్నది కూడా చెప్తాడు. ఆ తర్వాత రిషి ఒక వీడియోని చూపిస్తాడు అందులో చిత్రని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న అతనే చంపాలని ప్రయత్నం చేస్తాడు. ఇదంతా ఎవరు చేశారని రిషి బెదిరించడంతో.. ఒకతను వచ్చి ఇలా చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. అతని పేరు MSR అని చెప్పాడని అనగానే.. అందరూ షాక్ అవుతారు. MSR ఇదంతా చేసాడు అనుకుంటాడు. తనకి మాకు కాలేజీ గొడవలు ఉన్నాయి. అందుకే ఇలా చేస్తున్నాడు. నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండని పోలీసులకి రిషి చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళని పోలీసులు తీసుకొని వెళ్తారు. మరొకవైపు చిత్ర బాధ్యత మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ చూసుకుంటుందని రిషి చెప్తాడు. కాసేపటికి శైలేంద్రకి దేవయాని ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఎంతసేపటికి ఫోన్ కలవదు. మరొకవైపు శైలేంద్రకి ధరణి షర్ట్ బటన్ సెట్ చేస్తుంటే.. ధరణిని శైలేంద్ర రొమాంటిక్ గా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



