Krishna Mukunda Murari : కృష్ణతో ఉన్న బంధం ఏంటో మురారి తెలుసుకోనున్నాడా?
on Nov 29, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -326 లో... నువ్వు మా అక్క మైండ్ చేంజ్ చేసావని రేవతి అనగానే.. అత్తయ్య ఒకరు చెప్తే వినేరకం కాదు. తనకి నచ్చింది చేస్తోందని ముకుంద అంటుంది. ఎప్పుడు బృందావనం లాగా మా ఇల్లు ఉండేది. నువ్వు వచ్చాకే ఇలా అయిందని రేవతి అంటుంది. నాకు మురారికి పెళ్లి ఐతే కూడా అలాగే ఉంటుందని ముకుంద అంటుంది.
రెండు రోజుల తర్వాత అంతా చెప్తానన్న మాటలు మురారి గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే మురారి దగ్గరికి భవాని వచ్చి.. నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావని నాకు తెలుసు. నిన్ను టెన్షన్ పెట్టడం ఇష్టం లేక ఆ విషయం చెప్పాలని వచ్చానని భవాని చెప్తుంది. నువ్వు గతంలో ముకుందతో ప్రేమలో ఉన్నావని అనగానే మురారి షాక్ అవుతాడు. ముకుందతో నేను ప్రేమలో ఉన్నానా? నాకెప్పుడు అలా అనిపించలేదని మురారి అనుకుంటాడు. వాళ్ళ కుటుంబంతో కలిసి కృష్ణ కుట్రలు చేసి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని భవాని చెప్తుంది. " నీ మీదనే ఆశలు పెట్టుకొని ఉన్న ముకుందకి న్యాయం చెయ్యాలి. మీ పెళ్లి చెయ్యాలి" అని భవాని అనగానే.. మురారి ఎదో చెప్పబోతుంటే నువ్వేం మాట్లాడకు. ఆ కృష్ణని కలవకని భవాని చెప్పి వెళ్ళిపోతుంది. మురారికి మాత్రం ఏం అర్థం కాదు. మరొకవైపు కృష్ణ పెళ్లి ఫోటో చూస్తూ ఉంటుంది. అప్పుడే ముకుంద వచ్చి ఫోటో లాక్కొని కాల్చి వెయ్యాలని చూస్తుంటే కృష్ణ లాక్కుంటుంది.
మురారికి గదిలో గతానికి సంబంధించినవి ఏమైన దొరుకుతాయోనని వెతుకుతాడు. కానీ ఒక్కటి కూడా దొరకదు. మరొకవైపు ఈ పెళ్లిని ఎలాగైనా ఆపుతానని రేవతితో కృష్ణ చెప్తుంది. మురారి ఇప్పుడు కృష్ణ దగ్గర ఉంటాడు. ఇప్పుడు వెళ్లి ఈ ఫోటోస్ కృష్ణ ముందే మురారికి చూపించాలని ముకుంద అనుకుంటుంది. మురారి, ముకుంద ఇద్దరు ప్రేమించుకున్నప్పటి ఫోటోస్ లని వాళ్ళ దగ్గరికి వెళ్లి చూపిస్తుంది. ఇతను ఎవరని అనగానే.. కృష్ణకి బాగా తెలుసని ముకుంద అంటుంది. చెప్పు కృష్ణ ఎవరు నా పక్కన ఉన్నది ఎవరని ముకుంద అనగానే.. కృష్ణ ఇబ్బందిగా మీరేనని చెప్తుంది. మురారి షాక్ అవుతాడు.. తరువాయి భాగంలో మురారి నిద్రలో కృష్ణని గుర్తుకు చేసుకొని ఒక్కసారిగా కృష్ణ అని లేచి అరుస్తాడు. దాంతో ఏంటి గతం గుర్తుకు వచ్చిందా అని ముకుంద టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
