Brahmamudi: ఆమెలో మొదలైన అనుమానం.. అతడి మోసం బయటపడుతుందా?
on Nov 29, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -265 లో.... అప్పు, కళ్యాణ్ లని ఒక్కటి చెయ్యాలని కనకం అనుకొని.. ఏదైనా సలహా ఇవ్వొచ్చు కదా అని అన్నపూర్ణని అడుగుతుంది. నువ్వు నీ ఇద్దరు కూతుళ్లు ఆ ఇంట్లో ఉన్న విషయం మర్చిపోకని అన్నపూర్ణ అనగానే... మన అప్పు లాగే కళ్యాణ్ కూడా అప్పుని ప్రేమిస్తున్నడెమో అప్పు చెప్పలేదని బయటపడట్లేదు అనుకుంటా.. ఆ అనామిక ప్రేమిస్తున్నట్లు చెప్పగానే కళ్యాణ్ ఒప్పుకున్నాడని కనకం అంటుంది.
మనం ముందు కళ్యాణ్ మనసులో ఏం ఉందో కనుక్కోవాలని కనకం అంటుండగా.. అప్పుడే కృష్ణమూర్తి వచ్చి నువ్వు ఇప్పటివరకు చేసిన తప్పులు చాలు. ఇక ఈ విషయంలో ఎం తప్పు చెయ్యకు. ఇప్పటికే ఆ ఇంటికి వెళ్తే మనకు విలువ లేదు. ఏం చేసిన నాకు చెప్పు. నాకు చెప్పకుండా ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో నుండి గెంటేస్తానని కనకానికి కృష్ణమూర్తి వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు స్వప్న దగ్గరికి కావ్య వచ్చి.. అరుణ్ కి సంబంధించిన విషయం ఏదైనా నాకు చెప్పమని చెప్పాను కదా ఎందుకు ఇలా చేసావని కావ్య అడుగుతుంది. నాకేం తెలుసు ఇలా చేస్తాడని ఇంత సపోర్ట్ చేసినవాడు ఇలా చేస్తాడని ఎవరైనా ఉహిస్తారా అని స్వప్న అనగానే.. అవును దీని వెనకాల ఎవరో ఉండి చేపిస్తున్నారని కావ్య అంటుంది.
ఆ తర్వాత అమ్మకి నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పవా అని కావ్య అడుగుతుంది. చెప్పలేదు ఇప్పుడు ఇదంతా చెప్తే ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది. నేను టైమ్ చూసుకొని చెప్తానని స్వప్న చెప్తుంది. ఆ తర్వాత అరుణ్ గురించి కావ్య ఆలోచిస్తూ రాహుల్, రుద్రాణి ల దగ్గరికి వెళ్లి.. మీకు ఆ ఫొటోస్ ఎలా వచ్చాయి? ఎవరు పంపించారని అడుగుతుంది. మాకేం తెలుసు నంబర్ పంపిస్తున్నాను ఎంక్వైరీ చేసుకోమని కావ్యకి రాహుల్ నెంబర్ పంపిస్తాడు. ఆ తర్వాత కావ్య ఆ నెంబర్ చూసి ఇది రాహుల్ నెంబర్ అని అనుకుంటుంది..
మరొక వైపు అనామిక, కళ్యాణ్ ఇద్దరు షాపింగ్ కి వెళ్తు.. అప్పు ని తీసుకొని వెళదామని అప్పు దగ్గరకు వస్తారు. అనామిక బయట ఉండి కళ్యాణ్ ఒక్కడే లోపలికి వస్తాడు. ఆ తర్వాత అప్పు బయటకు రావడం లేదు. దేని గురించో బాధపడుతుందని కళ్యాణ్ తో కనకం అనగానే.. నేను వెళ్లి కనుకుంటానని కళ్యాణ్ అంటాడు. అప్పు దగ్గరికి వెళ్ళిన కళ్యాణ్.. షాపింగ్ కి వెళదాం పద అని అనగానే అప్పు రానని చెప్తుంది. ఎందుకు ఇలా ఉంటున్నావ్? నేను ఇలా ఉన్నానంటే కారణం నువ్వే అప్పు గురించి గొప్పగా చెప్తూ ఉంటాడు కళ్యాణ్.. అప్పుడే అనామిక లోపలికి వచ్చి.. కళ్యాణ్ పై అరుస్తుంది. బయట నన్ను ఉండమని చెప్పి నీ ఫ్రెండ్ తో కబుర్లు చెప్తున్నావా? నీ ఫ్రెండ్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్న అంతగా నన్ను అర్థం చేసుకోవడం లేదని అనామిక కోపంగా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో అరుణ్ దగ్గరికి రాహుల్ వచ్చి.. ఇప్పుడు నీ దగ్గరకి కావ్య వస్తుందని చెప్పగానే అరుణ్ షాక్ అవుతాడు. మరొకవైపు రాజ్ ని తీసుకొని కావ్య అరుణ్ దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
