ఐదుగురు హీరోలను కవర్ చేస్తున్న సమంత!
on Oct 26, 2022

సమంత తాజా చిత్రం 'యశోద' నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాని ప్రమోట్ చేయడం కోసం ఐదు భాషలకు చెందిన స్టార్స్ ని రంగంలోకి దింపుతుండటం విశేషం.
'యశోద' ట్రైలర్ ను రేపు(అక్టోబర్ 27న) సాయంత్రం 5:36 కి విడుదల చేయనున్నారు. అయితే ఒక్కో భాషలో ఒక్కో స్టార్ ఈ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళ్ లో సూర్య, హిందీలో వరుణ్ ధావన్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కానుంది. ఇక తెలుగులో 'యశోద' ట్రైలర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఐదు భాషల్లో ఐదుగురు హీరోల చేతుల మీదుగా విడుదలవుతున్న 'యశోద' ట్రైలర్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



