నయనతార సరోగసీ చట్టబద్ధమే!
on Oct 26, 2022

కోలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. సరోగసీ చట్టాన్ని అతిక్రమించి వీరు పిల్లలకు జన్మనిచ్చారని ఆరోపణలు వినిపించాయి. అయితే తాజాగా ఈ జంట సరోగసి వివాదం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది.
నయన్-విఘ్నేష్ సరోగసీ చట్టాన్ని అతిక్రమించి పిల్లలకు జన్మనిచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో దీనిపై విచారణ జరపటానికి తమిళనాడు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. విచారణ జరిపిన కమిటీ నయన్ దంపతుల సరోగసి చట్టబద్ధమేనని నివేదికను సమర్పించింది. 2016 మార్చి 11న నయన్-విఘ్నేష్ పెళ్లి రిజిస్టర్ అయిందని విచారణలో తేలిందట. అలాగే సరోగసి ప్రక్రియ 2021 ఆగస్టులో మొదలైందని, నవంబర్‌లో సరోగసి విధానంపై ఒప్పందం కుదుర్చుకున్నారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో నయన్ దంపతుల సరోగసి వివాదానికి తెర పడినట్లేనని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



