శాటర్న్ అవార్డు.. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్'!
on Oct 26, 2022

'ఆర్ఆర్ఆర్' చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఓ వైపు ఆస్కార్స్ బరిలో నిలిచి సత్తా చాటాలని చూస్తున్న 'ఆర్ఆర్ఆర్'.. తాజాగా ఓ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో శాటర్న్ అవార్డుని 'ఆర్ఆర్ఆర్' తన ఖాతాలో వేసుకుంది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రశంసలు అందుకుంది. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం అవార్డులు గెలుస్తుండటం విశేషం. అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డు ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్'కి వరించింది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో ఈ అవార్డు గెలుచుకుంది. దీంతో 'ఆర్ఆర్ఆర్'పై మరోసారి ప్రశంసలు వర్షం కురుస్తోంది.
ఈ ఏడాది మార్చిలో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఇక ఇటీవల జపాన్ లో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం త్వరలో మరికొన్ని దేశాల్లో విడుదలవ్వడానికి సిద్ధమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



