భారీ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న 'యశోద'!
on Nov 10, 2022

రేపు(నవంబర్ 11న) 'యశోద' సినిమాతో సమంత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి హరి-హరీష్ దర్శకులు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టే సినిమా థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరిగింది.
ఆసక్తికర కంటెంట్ తో పాటు సమంత స్టార్ డమ్ కూడా తోడు కావడంతో 'యశోద' బిజినెస్ భారీగానే జరిగినట్టు తెలుస్తోంది. నైజాంలో రూ.4.50 కోట్లు, ఆంధ్రాలో రూ.5.50 కోట్లు, సీడెడ్ లో రూ.1.50 కోట్లతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ.11.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిందట. ఇక తమిళనాడులో రూ.4 కోట్లు, కర్ణాటకలో రూ.1.50 కోట్లు, హిందీ+రెస్టాఫ్ ఇండియా రూ.2 కోట్లు, ఓవర్సీస్ లో రూ.2.50 కోట్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.21.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిందని సమాచారం. అంటే ఈ సినిమా హిట్ గా నిలవాలంటే వరల్డ్ వైడ్ గా రూ.22 కోట్లకి పైగా షేర్ రాబట్టాల్సి ఉంది.
పెద్ద సినిమాలతో పోటీ పడకుండా సోలోగా విడుదలవుతుండటం 'యశోద'కు కలిసొచ్చే అంశం. రెండేళ్ల తర్వాత సమంత నుంచి వస్తున్న తెలుగు సినిమా కావడంతో ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. ఇటీవల విడువులైన పలు సినిమాలతో పోల్చుకుంటే 'యశోద' బుకింగ్స్ మెరుగ్గానే ఉన్నాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించి, సమంతకు విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



