ఆ నెంబర్ నా భర్తది కాదు..మీరు మోసపోతే మా తప్పు కాదు
on Nov 10, 2022

సైబర్ నేరాలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతా డిజిటల్ ఐపోయేసరికి దానికి తగ్గ కేటుగాళ్లు కూడా తయారవుతూనే ఉన్నారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. రీసెంట్ గా నటి పూర్ణకి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. తన భర్త ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టి కొంతమంది ట్రాంజాక్షన్స్ చేస్తున్నారని...అలా ఎవరైనా మోసపోతే.. అందుకు తన భర్త కారణం కాదంటూ సోషల్ మీడియా వేదికగా ఒక హెచ్చరిక జారీ చేసింది పూర్ణ. ప్రసుత్తం ఈ పోస్ట్ వైరలవుతోంది. పూర్ణ ఇటీవలే దుబాయ్‌లో సెట్టిల్ ఐన జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. తన వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అలాగే తన భర్త కంపెనీకి సంబంధించిన ఈవెంట్లను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా ప్రమోట్ చేస్తుంది పూర్ణ.
ఇలాంటి టైంలో ‘‘+971 52 724 5366 ఫోన్ నంబరుతో నా భర్త షానిద్ పేరుతో తెలియని ఒకతను కొందరిని కాంటాక్ట్ చేసి డబ్బులు తీసుకుంటున్నట్టు నా దృష్టికి వచ్చింది. అయితే అది నా భర్త నంబర్ కాదు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ ప్రొఫైల్‌తో మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే దానికి నా భర్త బాధ్యుడు కాదు. అలా మీలో ఎవరైనా మోసపోతే.. నా భర్తకు సంబంధం లేదు’’ అని పోస్ట్ చేసింది పూర్ణ. తాజాగా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు యూఏఈ గోల్డెన్ వీసా ఇప్పించారు పూర్ణ దంపతులు. ఈ ఈవెంట్‌ను పూర్ణ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లైవ్ కూడా ఇచ్చారు. గతంలో ప్రభుదేవాకు కూడా ఇలానే గోల్డెన్ వీసా ఇప్పించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



