తలైవి... థియేటర్లలోకి వచ్చిన తర్వాతే!
on Jun 8, 2020

కంగనా రనౌత్ ప్రధానపాత్రలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నటి జయలలిత జీవితం ఆధారంగా దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తెరకెక్కించిన సినిమా 'తలైవి'. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తామని కొబ్బరికాయ కొట్టినప్పుడే చెప్పారు. దాదాపుగా సినిమా పూర్తయింది. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. వాటిని చిత్రబృందం ఖండించింది. "తలైవి సినిమా థియేటర్ లోకి వచ్చిన తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. ఓటీటీలో సినిమాను ప్రీమియర్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. ముందు థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుంది" అని తలైవి బృందం పేర్కొంది.
జయలలిత పాత్రలో నటించిన కంగనా రనౌత్ సైతం 'తలైవి' వంటి సినిమాలను ఓటీటీలో విడుదల చేయలేమని, థియేటర్లలో విడుదల చేస్తేనే నిర్మాతలకు లాభాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 55 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుందని సమాచారం. ఈ సినిమాలో 300 మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించాల్సి సన్నివేశాలు ఉన్నాయట. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఆ సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



