తారక్ తో నాట్ ఓకే.. మరి బాలయ్యతో!?
on Mar 16, 2022

`క్రాక్`(2021)తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన చెన్నై పొన్ను శ్రుతి హాసన్.. టాలీవుడ్ లో వరుసగా అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. `క్రాక్` అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జంటగా `వకీల్ సాబ్`(2021)లో ఎంటర్టైన్ చేసిన శ్రుతి.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా `సలార్` చేస్తోంది. అలాగే సీనియర్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణతోనూ సినిమాలు చేస్తోంది. `మెగా 154`లో చిరు సరసన, `ఎన్బీకే 107`లో బాలయ్యకి జతగా శ్రుతి హాసన్ దర్శనమివ్వనుంది.
ఇదిలా ఉంటే, నందమూరి కాంపౌండ్ లో శ్రుతి హాసన్ కి ఇది రెండో సినిమా. గతంలో ఆమె.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన `రామయ్యా వస్తావయ్యా`(2013)లో ఆడిపాడింది. భారీ అంచనాల నడుమ విడుదలైన సదరు చిత్రం.. బాక్సాఫీస్ ముంగిట నిరాశపరిచింది. మరి.. నందమూరి అబ్బాయ్ తారక్ సరసన విజయం చూడలేకపోయిన శ్రుతి.. అతని బాబాయ్ బాలయ్యతోనైనా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. కాగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న `ఎన్బీకే 107`.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజయ్యే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



