'ఆర్ఆర్ఆర్'కి ముందే సీక్రెట్ ఫ్రెండ్‌షిప్.. అప్పటి నుంచే స్టార్ట్
on Mar 16, 2022

'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. విడుదల తేదీ మార్చి 25 దగ్గర పడుతుండటంతో డైరెక్టర్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. వరుస ప్రెస్ మీట్స్ తో, ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ముగ్గురితో ఫన్ చిట్ చాట్ నిర్వహించారు. చాలా సరదాగా సాగిన వీరి సంభాషణ ఆకట్టుకుంటోంది.
'ఆర్ఆర్ఆర్' లో చరణ్ కి జోడిగా ఆలియా భట్ కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో తారక్ కి జోడినా కాదా? అనే విషయంపై క్లారిటీ లేదు. తాజాగా ఇదే విషయాన్ని అనిల్ ప్రస్తావించాడు. "సినిమాలో మీకు హీరోయిన్ ఉందా?' అని తారక్ ని అనిల్ అడగగా.. "ఉండీ ఉండనట్లుగా.. ఉందో లేదో అన్నట్లుగా.. ఏదో విచిత్రంగా పెట్టారు. సినిమా చూస్తేనే క్లారిటీ వస్తుంది. ట్రైలర్ లో కూడా మెరుపుతీగలాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది" అంటూ తారక్ సరదాగా చెప్పుకొచ్చాడు.

అలాగే తారక్, చరణ్ ల ఫ్రెండ్‌షిప్ గురించి అనిల్ అడిగాడు. రెండు బిగ్ ఫ్యామిలీస్ కి చెందిన ఇద్దరు స్టార్స్ ఇంతలా ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఈ ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అని అనిల్ అడగగా.. "ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందే సమాజానికి తెలియకుండా మేం చాలా మంచి ఫ్రెండ్స్" అని తారక్ చెప్పాడు. "అపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి అన్నట్లు వేరు వేరు మెంటాలిటీస్ ఉన్న మేం ఇంతలా కలిసిపోయాం. లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా కూల్ గా ఉండగలడు చరణ్. అదే నన్ను ఆకర్షించింది. సెలబ్రిటీ క్రికెట్ టైంలో ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. బాగా మాట్లాడుకునేవాళ్ళం. అప్పటినుంచి బాగా దగ్గరయ్యాం. అలా సీక్రెట్ గా ఉన్న మా ఫ్రెండ్షిప్ ఆర్ఆర్ఆర్ వల్ల ఇప్పుడు అందరికి తెలిసింది" అని తారక్ చెప్పుకొచ్చాడు.
"మా ఇద్దరి ఇళ్ళు దగ్గరే. మార్చి 26 ప్రణతి(తారక్ భార్య) బర్త్ డే. మార్చి 27 చరణ్ బర్త్ డే. అర్థరాత్రి 12 గంటలకు నేను రెడీగా గేట్ బయట ఉంటాను. చరణ్ కారు వేసుకొని వచ్చి తీసుకెళ్తాడు. అలా చరణ్ బర్త్ డే లు ఎన్నో సెలెబ్రేట్ చేసుకున్నాం" అని తారక్ తెలిపాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



