రవితేజకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే చిత్రం అదేనంటున్నాడు!
on Dec 25, 2022

ప్రస్తుతం ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్,అల్లు అర్జున్ నుంచి విజయ్ దేవరకొండ, నిఖిల్ వరకు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నామని అంటున్నారు. అందులో కాస్త వాస్తవం కూడా ఉంది. వారి తదుపరిచిత్రాలు కూడా పాన్ వరల్డ్, పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన రవితేజ ధమాకా మూవీ ని కూడా తెలుగుతో పాటు తమిళం, కన్నడ వంటి భాషల్లో విడుదల చేస్తున్నామని ప్రకటించారు. దాంతో ఇది రవితేజ మొదటి పాన్ ఇండియా చిత్రం అంటూ ప్రచారం జరిగింది. కానీ వాటిని రవితేజ కొట్టి పారేశాడు. ధమాకా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో ఆయన తన రాబోయే సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ నా ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అనుకోను. నాకంటూ పాన్ ఇండియా సినిమా అంటే ఒక అర్థం ఉంది. అందుకే ధమాకాను పాన్ ఇండియా సినిమా అనడానికి లేదు. కానీ నేను చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రం మాత్రం కచ్చితంగా పాన్ ఇండియా సినిమా అన్నట్లుగా ఉంటుంది. అదే నా మొదటి పాన్‌ఇండియా చిత్రం అన్నాడు.
టైగర్ నాగేశ్వరరావు చిత్రం చాలా కాలం కిందట ఆంధ్ర ప్రదేశ్ లోని స్టువర్ట్ పురం లో రాబిన్ హుడ్ తరహా దొంగతనాలు చేస్తూ....ప్రజల మన్నలను కూడా పొంది పేదవారికి సహాయం చేసే టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ నిజ జీవిత కథతో రూపొందుతోంది. మొదట ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి తో తీయాలనుకున్నారు. ఎందుకంటే రానా దగ్గుబాటికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వాస్తవానికి టైగర్ నాగేశ్వరరావు తెలుగువాడే అయినా ఆయన జీవితం దేశంలో చాలామంది వ్యక్తిగత జీవితాలను పోలి ఉంటుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందడం లేదు. భారీ విజువల్స్ తో గ్రాండియర్ గా ఉండదు. కాన్సెప్ట్, కంటెంట్ పరంగా టైగర్ నాగేశ్వరరావును పాన్ ఇండియా సినిమాగా భావిస్తాను అని రవితేజ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా సక్సెస్ అయితే రాబోయే కాలంలో రవితేజ నుండి ఇలాంటి పాన్ ఇండియా చిత్రాలు మరిన్ని వచ్చే అవకాశం ఉంది. నిజానికి రవితేజపై కేవలం రొటీన్ మాస్ మసాలా చిత్రాలు చేస్తారని, మూసధోరణిలో ఆయన చిత్రాలు ఉంటాయని అంటారు. కానీ ఆయనలో కూడా ఒక మంచి అభిరుచి ఉంది. అంతకు మించిన ప్రతిభ ఉంది. కానీ వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆయనలోని టాలెంట్ నా ఆటోగ్రాఫ్, ఖడ్గం నేనింతే, షాక్ వంటి చిత్రాలు ద్వారా మనకు అర్థమవుతుంది. మొదట్లో రవితేజ చాలా మంచి చిత్రాలను చేశాడు. కానీ పూరి జగన్నాథ్ తో ఇడియట్ వచ్చినప్పటి నుంచి ఆయనపై ఒక బ్రాండ్ పడిపోయింది. రవితేజలో అద్భుతమైన నటుడు కూడా ఉన్నాడు. దాంతో పాటు ఆయన దర్శకత్వ శాఖలో కూడా పనిచేశాడు కాబట్టి ఆయనకు పాన్ ఇండియా చిత్రాలపై ఒక అభిప్రాయం, అవగాహన ఉన్నాయి. కాబట్టి టైగర్ నాగేశ్వరరావు నుండి రవితేజకు మంచి కాన్సెప్ట్ కలిగిన చిత్రాలు వస్తాయని, ఆయన వాటిని చేసి మెప్పించి తనలోని అసలు నటుడిని బయటకు తెస్తాడని భావించవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



