మహేశ్ మరోసారి కలిసొచ్చేనా!
on Feb 6, 2022

సూపర్ స్టార్ మహేశ్ బాబు టైటిల్ రోల్ లో నటించిన `శ్రీమంతుడు` చిత్రంతో నిర్మాణ రంగంలోకి తొలి అడుగేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఆపై `జనతా గ్యారేజ్`, `రంగస్థలం` వంటి మరో రెండు సెన్సేషనల్ హిట్స్ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ బేనర్ గా తెలుగునాట వార్తల్లో నిలిచింది. ఇక రీసెంట్ గా `ఉప్పెన`, `పుష్ప - ద రైజ్`తో మరో రెండు సంచలన విజయాలను నమోదు చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. త్వరలో `సర్కారు వారి పాట`తో సందడి చేయనుంది.
`శ్రీమంతుడు` తరువాత మహేశ్ బాబుతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ఇదే కావడంతో.. `సర్కారు వారి పాట`పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి.. తమ ఫస్ట్ హీరో మహేశ్ బాబుతో మైత్రీ మూవీ మేకర్స్ చేస్తున్న ఈ ద్వితీయ ప్రయత్నం ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
కాగా, `సర్కారు వారి పాట`ని పరశురామ్ డైరెక్ట్ చేస్తుండగా.. ఇందులో మహేశ్ బాబుకి జంటగా కీర్తి సురేశ్ నటిస్తోంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. వేసవి కానుకగా మే 12న థియేటర్స్ లో సందడి చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



