అఖిల్ మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే!
on Feb 6, 2022

'అఖిల్' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన అక్కినేని అఖిల్.. తాను హీరోగా నటించిన నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'తో మొదటి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ 'ఏజెంట్' సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందనుందని తెలుస్తోంది.
'బాహుబలి' తర్వాత తెలుగు సినిమా మార్కెట్ పెరిగిపోయింది. కొంతకాలంగా అందరి దృష్టి పాన్ ఇండియా సినిమాలపై పడింది. ఇటీవల పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' నార్త్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. త్వరలో 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి క్రేజీ పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. ఇలా వరుసగా టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏజెంట్ తో అఖిల్ కూడా పాన్ ఇండియా మారబోతున్నాడు.
ఏజెంట్ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర నిమిస్తున్న ఈ సినిమాకి హిపాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. మరి ఈ పాన్ ఇండియా మూవీతో అఖిల్ ఎంతటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



