'ఆటో జానీ' కాదు.. మెగాస్టార్ కోసం పూరి కొత్త కథ!
on Oct 13, 2022

రాజకీయాల కారణంగా తొమ్మిదేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'ఖైదీ నెంబర్ 150'(2017) తో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి మెగాస్టార్ రీఎంట్రీ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాల్సి ఉంది. చిరంజీవి కోసం 'ఆటో జానీ' అనే స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేశాడు పూరి. కానీ కొన్నికారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే తాజాగా చిరంజీవి స్వయంగా 'ఆటో జానీ' గురించి అడగగా.. పూరి ఆసక్తికర సమాధానం చెప్పాడు.
చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'లో పూరి జర్నలిస్ట్ పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో.. చిరుని పూరి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో 'ఆటో జానీ' ప్రస్తావన వచ్చింది. "ఆటో జానీ స్క్రిప్ట్ ఏం చేశారు.. ఉందా.. పక్కన పడేశారా?" చిరంజీవి అడగగా.. "అది పాత కథ.. మీకోసం అంతకంటే మంచి కథ రాస్తాను.. త్వరలోనే మిమ్మల్ని కలిసి వినిపిస్తాను" అని పూరి బదులిచ్చాడు. "మంచి స్క్రిప్ట్ తో వస్తే తప్పకుండా కలిసి పని చేద్దాం" అని మెగాస్టార్ భరోసా ఇచ్చారు.
ఇటీవల విజయ్ దేవరకొండతో చేసిన 'లైగర్'తో ఘోర పరాజయాన్ని చూశాడు పూరి. ఆ దెబ్బతో విజయ్ తో చేయాల్సిన మరో ప్రాజెక్ట్ 'జన గణ మన'ని పక్కన పెట్టాడు. ఈ టైంలో పూరికి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ చాలా అవసరం. మరి మంచి కథ సిద్ధం చేసి మెగాస్టార్ ని మెప్పిస్తాడేమో చూడాలి. అయితే చిరంజీవి చేతిలో ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య'(మెగా 154), 'భోళా శంకర్' వంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి తర్వాతే కొత్త ప్రాజెక్ట్ ప్రకటించే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



