మలయాళం రీమేక్‌ను నమ్ముకున్న మోహన్‌బాబు
on Oct 13, 2022

మోహన్‌బాబు త్వరలో ఓ రీమేక్‌లో నటించనున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి మంచు విష్ణు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రను మోహన్‌బాబు పోషించనున్నారు. ఈ విషయాన్ని విష్ణు తెలియజేశారు. "వచ్చే సంవత్సరం జనవరిలో 'ఆండ్రాయిడ్ కుంజప్పన్' తెలుగు రీమేక్‌ను సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో మెయిన్ రోల్‌ను నాన్నగారు పోషిస్తారు. ఆయన కొడుకు పాత్రలో ఓ ప్రముఖ నటుడు నటిస్తారు. ఇప్పటి తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఒరిజినల్ స్టోరీలో మార్పులు చేస్తున్నాం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం" అని ఆయన చెప్పారు.
మలయాళం మాతృకలో సూరజ్ వెంజరమూడు చేసిన వృద్ధుని పాత్రను తెలుగులో మోహన్‌బాబు చేయనున్నారు. వెంజరమూడు కొడుకుగా సౌబిన్ షాహిర్ చేశాడు. తెలుగులో ఆ క్యారెక్టర్‌ను ఓ పేరున్న నటుడుని సంప్రదిస్తున్నారు. ఇక ఆండ్రాయిడ్ కుంజప్పన్ అనే రోబో రోల్‌ను ఒరిజినల్‌లో సూరజ్ తెలక్కాడ్ చేశాడు. అది కూడా చాలా కీలక పాత్ర. దాన్ని రీమేక్‌లో ఎవరు చేస్తారో చూడాలి. మలయాళ ఒరిజినల్‌ను రతీష్ బాలకృష్ణన్ డైరెక్ట్ చేశాడు. తెలుగు వెర్షన్‌ను ఎవరు డైరెక్ట్ చేసేదీ ఇంకా వెల్లడించలేదు. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.
ఈ ఏడాది మొదట్లో 'సన్నాఫ్ ఇండియా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోహన్‌బాబు, ప్రస్తుతం తన కుమార్తె లక్ష్మితో కలిసి 'అగ్నినక్షత్రం' అనే సినిమా చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



