మెగా ట్విస్ట్.. 'గాడ్ ఫాదర్' ప్లాప్ ఎందుకవుతుంది?
on Oct 13, 2022

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' అక్టోబర్ 5న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రూ.90 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిందని, బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఫుల్ రన్ లో 'గాడ్ ఫాదర్'కి కనీసం రూ.25 కోట్ల నష్టం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో.. "అసలు మేం సినిమాని ఎవరికీ అమ్మలేదు.. సొంతం విడుదల చేసుకున్న సినిమాకి ఈ లెక్కలేంటి?" అంటూ 'గాడ్ ఫాదర్' నిర్మాత ఎన్వీ ప్రసాద్ బిగ్ షాక్ ఇచ్చారు.
తాజాగా మీడియా మాట్లాడిన ఎన్వీ ప్రసాద్ 'గాడ్ ఫాదర్' బిజినెస్ గురించి, కలెక్షన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సినిమాని ఎవరికీ అమ్మలేదు. మేం సొంతంగా విడుదల చేశాం. కలెక్షన్స్ మేం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి. అన్ని చోట్లా అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. ఓవర్సీస్ తో పాటు హిందీ కలెక్షన్స్ కూడా బలంగా ఉన్నాయి." అని ఎన్వీ ప్రసాద్ అన్నారు.
'గాడ్ ఫాదర్'ని సొంతంగా విడుదల చేశామని, కలెక్షన్స్ మేం ఊహించిన దానికంటే అద్భుతంగా ఉన్నాయని ఎన్వీ ప్రసాద్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా రూ.90 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని, బ్రేక్ ఈవెన్ కష్టమేనని వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టినట్టుగా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



