మూడు మహా మూవీల మధ్య 'బంగార్రాజు'కు థియేటర్లు దొరుకుతాయా?
on Nov 30, 2021
వచ్చే సంక్రాంతి సీజన్ సినీ ప్రియులకు కనువిందు కానున్నది. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయ'క్, 'రాధే శ్యామ్' సినిమాలు సంక్రాంతి బెర్తులను ఖరారు చేసుకోగా, వాటితో పాటు నాగార్జున-నాగచైతన్య సినిమా 'బంగార్రాజు' సైతం సంక్రాంతికి రావడానికే నిశ్చయించుకుంది. ఇదివరకు చెప్పినవిధంగానే 2022 జనవరి 15న 'బంగార్రాజు' విడుదల కానున్నది. ఈ మూవీలో నాగ్ సరసన రమ్యకృష్ణ, చైతూ జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు.
కల్యాణ్‌కృష్ణ కురసాల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఒక ఎస్సెట్ కానున్నదని ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ తెలియజేసింది. రెండో పాట "నా కోసం"ను డిసెంబర్ 1న విడుదల చేయనున్నారు. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌ను చైతూ, కృతిపై చిత్రీకరించారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
Also read: 2022లో నాగ్ ట్రిపుల్ ధమాకా!
కాగా, 'బంగార్రాజుకు' థియేటర్లు లభ్యమవుతాయా అనే సందేహం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. జనవరి 7న రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్', జనవరి 12న పవన్ కల్యాణ్ మూవీ 'భీమ్లా నాయక్', జనవరి 14న ప్రభాస్-పూజా హెగ్డే ఫిల్మ్ 'రాధే శ్యామ్' వస్తున్నాయి. వీటిపై ఉన్న క్రేజీ అలాంటిలాంటిది కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న థియేటర్లను ఈ మూడు సినిమాలకు కేటాయించడానికే ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భంలో వాటితో పోలిస్తే చిన్న సినిమా అయిన 'బంగార్రాజు'కు థియేటర్లు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Also read: `బంగార్రాజు`పైనే `శివగామి` ఆశలు!
అయితే 'బంగార్రాజు'కు ఒరిజినల్ మూవీ అయిన 'సోగ్గాడే చిన్ని నాయనా' 2016 జనవరి 15న వచ్చి నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలవడంతో, 'బంగార్రాజు'ను కూడా సెంటిమెంట్‌గా అదే డేట్‌కు తీసుకురావాలని నాగ్ డిసైడ్ అయ్యాడు. దానికి తగ్గట్లు ఆ సినిమాపై కూడా సినీ గోయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి అదే డేట్‌కు 'బంగార్రాజు' రావడం అనివార్యమైతే థియేటర్లను ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
