మెగాస్టార్ మెచ్చిన నిహారిక 'ఫ్యామిలీ స్టోరీ'!
on Nov 30, 2021
యాంకర్ గా, నటిగా ప్రేక్షకులను అలరించిన మెగా డాటర్ నిహారిక.. నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇటీవల ఆమె నిర్మించిన 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5'లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓ మధ్య తరగతి కుటుంబ కథగా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రశంలు సైతం అందుకుంది.
'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ ని రీసెంట్ గా చూసిన చిరంజీవి తనకి ఈ సిరీస్ నచ్చిందని ట్వీట్ చేశారు. "ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూశాను. ఎంతో ఎంటర్ టైనింగ్ గా ఉంది. నిర్మాణంలో తన తొలి ప్రయత్నంలోనే ఇంత హృద్యంగా, వినోదాత్మకంగా తీసి ప్రేక్షకులను మెప్పిస్తున్న కొణిదెల వారి ఆడపడుచు నిహారికకి, టీమ్ కి నా అభినందనలు. మీరిచ్చిన ఈ స్ఫూర్తితో తను మరిన్ని జనరంజకమైన చిత్రాలను నిర్మించాలని కోరుకుంటూ నిహాకి శుభాకాంక్షలు" అంటూ నిహారికని అభినందిస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు.
'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' సక్సెస్ సాధించడంతో పాటు, చిరంజీవి ట్వీట్ చేయడంపై నిహారిక సంతోషం వ్యక్తం చేసింది. చిరంజీవి ట్వీట్ స్క్రీన్ షాట్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన నిహారిక.. తమ వెబ్ సిరీస్ మెగాస్టార్ కి నచ్చడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది. అలాగే ఓటీటీలో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'కి సూపర్ రెస్పాన్స్ వస్తుందని, ఇప్పటికే 60 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ వ్యూస్ ని సాధించిందని పేర్కొంది.
Also Read