ENGLISH | TELUGU  

క‌రోనా స్కేర్‌.. ఈసారైనా చెప్పిన డేట్‌కు 'ఆర్ఆర్ఆర్' వ‌స్తుందా?

on Apr 15, 2021

 

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు అనూహ్య స్థాయిలో విజృంభిస్తుండ‌టంతో స‌ర్వ‌త్రా భ‌యాందోళ‌న‌లు నెల‌కొంటున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య కొత్త రికార్డున సృష్టిస్తోంది. ఆల్‌మోస్ట్ రోజుకు 2 ల‌క్ష‌ల కేసుల మార్కు చేరుకుంది. ఈ ప‌రిస్థితుల్లో ఒక రంగం తీవ్ర క‌ల‌వ‌రానికి గుర‌వుతోంది. అది.. సినిమా ఇండ‌స్ట్రీ! లాక్‌డౌన్ కార‌ణంగా గ‌త ఏడాది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫిల్మ్ ఇండ‌స్ట్రీ వేలాది కోట్ల రూపాయ‌ల‌ను న‌ష్ట‌పోవ‌డం అటుంచి, ల‌క్ష‌లాది కుటుంబాల‌ను రోడ్డున ప‌డేసింది. థియేట‌ర్లు మూత‌ప‌డ‌టం, షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వేలాది కుటుంబాలు ఉపాధి క‌రువై అల్లాడిపోయాయి. 

2021 న‌వంబ‌ర్ నుంచి షూటింగ్‌లు మొద‌లై, క్ర‌మంగా థియేట‌ర్లు తెరుచుకుంటూ రావ‌డంతో, తిరిగి అంద‌రికీ ఉపాధి ల‌భించి, ఊపిరి పీల్చుకుంటున్నారు. అంత‌లోనే క‌రోనా సెకండ్ వేవ్ మ‌రింత ఉధృతంగా విరుచుకు ప‌డుతుండ‌టంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు భ‌యంతో వ‌ణికిపోతున్నాయి. టాలీవుడ్‌లోనూ రోజూ కొవిడ్‌-19 కేసులు వెలుగు చూస్తున్నాయి. షూటింగ్‌లో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా యూనిట్ మెంబ‌ర్స్‌లో ఎవ‌రో ఒక‌రు కొవిడ్‌-19 బారిన ప‌డుతూనే ఉన్నారు.

స‌మాజంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఇప్ప‌టికే రిలీజ్ డేట్ల‌ను అనౌన్స్ చేసిన సినిమాల‌ను విడుద‌ల చేయ‌కుండా పోస్ట్‌పోన్ చేస్తున్నారు నిర్మాత‌లు. అలా ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సిన 'ల‌వ్ స్టోరి', ఏప్రిల్ 23న రావాల్సిన 'ట‌క్ జ‌గ‌దీష్‌', ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన 'విరాట‌ప‌ర్వం' పోస్ట్‌పోన్ అయ్యాయి. వాటి కొత్త రిలీజ్ డేట్ల‌ను ప‌రిస్థితులు సానుకూల‌మ‌య్యాకే అనౌన్స్ చేయ‌నున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో ఇప్ప‌టికే రిలీజ్ డేట్ల‌ను అనౌన్స్ చేసిన ప‌లు భారీ ప్రాజెక్టుల మేక‌ర్స్ కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. మెగాస్టార్ 'ఆచార్య'‌, వెంక‌టేశ్ 'నార‌ప్ప‌', బాల‌కృష్ణ 'అఖండ'‌, ర‌వితేజ 'ఖిలాడి', ప్ర‌భాస్ 'రాధేశ్యామ్'‌, అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాల విడుద‌ల తేదీలు కూడా మారే అవ‌కాశం లేక‌పోలేదు. ప్ర‌ధానంగా మే నెల‌లో రిలీజ్ కావాల్సిన ఆచార్య‌, నార‌ప్ప‌, అఖండ‌, ఖిలాడి సినిమాలు చెప్పిన తేదీల‌కు వ‌స్తాయా అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త్వ‌ర‌లోనే వాటికి సంబంధించిన క్లారిటీ రానున్న‌ది. జూన్ నుంచి రిలీజయ్యే సినిమాల‌కు కొంత స‌మ‌యం ఉన్నందున మ‌రికొన్ని రోజులు వేచిచూసి, ఆ త‌ర్వాత నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది.

అదేవిధంగా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన 'ఆర్ఆర్ఆర్' అనుకున్న‌ట్లే వ‌స్తుందా? మ‌రోసారి వాయిదా ప‌డుతుందా?.. అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. దానికంటే ముందు రావాల్సిన సినిమాలు వాయిదాప‌డితే, అందుకు అనుగుణంగా 'ఆర్ఆర్ఆర్' విడుద‌ల‌ను కూడా వాయిదే వేసే అవ‌కాశాలున్నాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే దాని రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చెయ్యాల్సి వ‌స్తే, కొత్త రిలీజ్‌ డేట్ ఎప్పుడు ఉండొచ్చ‌నే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో న‌డుస్తోంది. అక్టోబ‌ర్‌లో రిలీజ్ చెయ్య‌లేక‌పోతే డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్‌కి లేదా జ‌న‌వ‌రిలో సంక్రాంతికి రిలీజ్ చేసే అవ‌కాశాలు ఉంటాయ‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే 2022 సంక్రాంతిని మ‌హేశ్ 'స‌ర్కారువారి పాట'‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ఇప్ప‌టికే బుక్ చేసుకున్నాయి. దాంతో భారీ ప్రాజెక్టుల‌కు ఈ రిలీజ్ డేట్లు పెద్ద ప్రాబ్లెమ్ అయ్యేట్లు క‌నిపిస్తోంది. ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.