'ఆచార్య'కు హైలైట్.. చరణ్ ఫైట్!
on Apr 15, 2021
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మల్టిస్టారర్ మూవీ 'ఆచార్య'. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సోషల్ డ్రామాకి మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, స్పెషల్ పోస్టర్స్, "లాహే లాహే" అంటూ సాగే ఫస్ట్ సింగిల్.. సినిమాపై అమాంతం అంచనాలు పెంచేశాయి.
ఇదిలా ఉంటే.. 'ఆచార్య'కే మెయిన్ హైలైట్‌గా నిలిచే ఓ అంశం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేమిటంటే.. ధర్మస్థలి విలేజ్ బ్యాక్ డ్రాప్లో చరణ్ పై వచ్చే సోలో ఫైట్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్. అంతేకాదు.. రెయిన్ ఎఫెక్ట్‌తో సాగే ఈ ఎపిసోడ్‌ని తనదైన శైలిలో కొరటాల పిక్చరైజ్ చేస్తున్నారని వినికిడి.
తన తొలి చిత్రం 'మిర్చి' నుంచి గత సినిమా 'భరత్ అనే నేను' వరకు కొరటాల చిత్రాల్లో ఓ ఫైట్ సీన్ తప్పకుండా సినిమాకి ఎస్సెట్ అవుతుంటుంది. అలా.. 'ఆచార్య'కి ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అవుతుందని అంటున్నారు. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్‌చరణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న 'ఆచార్య', వేసవి కానుకగా మే 13న ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు.
Also Read