ఇంకా ఆలస్యం చేస్తే అసలుకే ముప్పు!
on Feb 9, 2023

ఈ మధ్య కొన్నింటి విషయంలో ప్రచార ఆర్భాటమే గాని వాటిని ఎప్పుడూ విడుదల చేస్తారో ఎవరికి అర్థం కావడం లేదు. ఓటీటీ దిగ్గజ సంస్థలు ఇలాంటి విషయాలలో క్లారిటీ ఇవ్వడం లేదు. విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ దూత. ఈ రెండింటి పరిస్థితి అలాగే ఉంది. వీటి ప్రకటనలు వచ్చి నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు వీటి విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. వెంకీ- రానా కలిసి నటించిన తొలి వెబ్ యాక్షన్ త్రిల్లర్ రానా నాయుడు. నెక్స్ట్ ఫ్లిక్స్ కోసం అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు.
హైదరాబాదు, ముంబై నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్గా ఇది రూపొందుతోంది. గత ఏడాది సెప్టెంబర్ లో టీజర్ ని విడుదల చేశారు. కానీ ఇప్పటికీ స్ట్రీమింగ్ ఎప్పుడో తెలియదు. దీంతో ప్రేక్షకులకు దీనిపై క్రేజ్ పోయినట్టు కనిపిస్తోంది. నెలలు గడుస్తున్నా టైం ఫిక్స్ కాకపోవడంతో దాన్ని మర్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. 2023- 2024 వరకు తమ నుంచి విడుదలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించే నెక్స్ట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ విషయంలో మాత్రం మౌనం పాటిస్తోంది. ఇక విక్రం కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ దూత కూడా డిలే అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ కోసం దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం పది భాగాలుగా రానుంది. సూపర్ నేచురల్ స్పిరిట్ నేపథ్యంలో రూపొందుతోంది. కొన్ని నెలల కిందట నాగచైతన్య లుక్కుని విడుదల చేశారు. అప్పటి నుంచి మరో అప్డేట్ లేదు. ఇలా వీటిని ఆలస్యం చేసుకుంటూ పోతే వీటిని పట్టించుకునే వారే ఉండరు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వీటిని ఎందుకు హోల్డ్ లో పెట్టారో అర్థం కావడం లేదు. భారీ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సీరీస్ లు ఇప్పటికీ స్ట్రీమింగ్ కాకపోవడంతో ఈ ఏడాదైనా వీటికి మోక్షం ఉంటుందా అని అందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



