హీరోయిన్ల విషయంలో డోంట్ కేర్ అంటున్నా లోకేష్!
on Feb 9, 2023

కొంతమంది దర్శకులు కొత్త కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూ ఉంటారు. వారు మంచి ఫేమ్ సాధించి టాప్ స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతుంటారు. తమిళంలో మణిరత్నం తెలుగులో పూరి జగన్నాథ వంటి వారు ఎందరో స్టార్ హీరోయిన్లను పరిచయం చేశారు. ఇక లోకేష్ కనకరాజు విషయానికి వస్తే ఈయన తీసిన ఖైదీ చిత్రంలో హీరోయిన్ ఉండదు. కమలహాసన్ తో తీసిన విక్రం సినిమాలో హీరోయిన్ ఉండదు. విజయ్ మాస్టర్ సినిమాలో మాళవిక మోహనన్ను తీసుకున్నారు. తమిళంలో ఆమెకు అదే మొదటి సినిమా. ప్రస్తుతం విజయ్‌తో చేయబోయే సినిమా కోసం త్రిష, ప్రియా ఆనంద్ లను ఎంపిక చేశారు. ఈ విధంగా చూసుకుంటే లోకేష్ కనుక పనిచేస్తే అవుట్ డేటెడ్ హీరోయిన్లతో పని చేస్తారు. లేకపోతే కొత్తవారితో పని చేస్తారు. అంతేగాని స్టార్ హీరోయిన్లతో పని చేయడానికి ఆసక్తి చూపరని స్పష్టంగా అర్ధమవుతుంది. అలాగే పాటలకంటే కథకి ప్రాధాన్యం ఇస్తారు. స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేస్తారు.
హీరోయిన్ పాత్రలకు అసలు సరిగా ప్రాధాన్యం ఇవ్వరు. వారిపై ఆధారపడడు. కథ కోసం హీరోయిన్ ని పెట్టుకుంటాడే గానీ వారిపై ఎక్కువగా ఆధారపడరు. తాజాగా ఏకంగా విజయ్ సినిమాలో కూడా ప్రేక్షకులు పూర్తిగా విజయ్ మీదనే ఫోకస్ చేసేలా చూసుకుంటున్నారు. అంతేగానీ స్టార్ హీరోయిన్ల కోసం వెంపర్లాడటం లేదు. వారిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ఇక ప్రశాంత్ నీల్ ది కూడా ఇదే పరిస్థితి. ఆయన కూడా హీరోయిన్ల ఎంపికలో పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు. వారిపై ఆధారపడరు. కేజీఎఫ్ చాప్టర్1, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలలో హీరోయిన్ల సంగతి అందరు చూశారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ తో సలార్ అనే సంచలన చిత్రం చేస్తున్నారు. ఇందులో ఆయన ఫేడవుట్ అయిన శృతిహాసన్ ని హీరోయిన్గా ఎంచుకున్నారు. ఈ విషయంలో ప్రభాస్ అభిమానుల నుంచే కాకుండా పలువురి నుంచి శృతిహాసన్ మైనస్ అవుతుందని అభ్యర్థనలు వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు. దాంతో విమర్శల పాలవుతున్నా తన పంతం మార్చుకోలేదు. మొత్తానికి ఈ దర్శకులకు హీరోయిన్లతో పనిలేదు. వారు కేవలం నామ్కే వాస్తే ఉంటారు. సినిమా కథ మొత్తం హీరోల చుట్టూనే తిరుగుతుంది. స్క్రీన్ ప్లే ప్రధానంగా సినిమాలు సాగుతాయి. అనవసర పాటలు, లవ్, రొమాన్స్ సీన్స్ ఉండవు కాబట్టి వారికి ఇదే హ్యాపీ అని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



