కాపీ వివాదంలో 'రైటర్ పద్మభూషణ్'!
on Feb 9, 2023

యువ నటుడు సుహాస్ హీరోగా నటించిన 'రైటర్ పద్మభూషణ్' ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చిన్న సినిమాగా వచ్చి మంచి వసూళ్లను రాబడుతూ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో ఈ చిత్రం కాపీ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
'రైటర్ పద్మభూషణ్'లోని పలు సన్నివేశాలు 2017లో వచ్చిన హిందీ సినిమా 'బరేలీ కీ బర్ఫీ'ని పోలి ఉన్నాయట. దీంతో ఆ సినిమా తెలుగు రైట్స్ ని ఎప్పుడో కొన్న ఓ నిర్మాత.. 'రైటర్ పద్మభూషణ్' టీమ్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వివాదం ముదురుతుందో లేక చర్చలతో సద్దుమణుగుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



