పది రోజుల్లో పెళ్లి.. ఇన్‌స్టా పోస్టుల్ని డిలీట్ చేసిన హీరోయిన్!
on Nov 17, 2022

తెలుగు ప్రేక్షకులకు 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది మంజిమా మోహన్. కొంత కాలంగా తమిళ యాక్టర్ గౌతమ్ కార్తీక్ (సీనియర్ యాక్టర్ కార్తీక్ కుమారుడు)తో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉంది. మూడేళ్ల క్రితం వచ్చిన తమిళ్ ఫిల్మ్ 'దేవరాట్టం'లో కలిసి నటించే సమయంలో ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తర్వాత సహజీవనం చేస్తూ వచ్చిన వారు, ఇటీవల తమ అనుబంధాన్ని పబ్లిక్‌గా ప్రకటించారు. గౌతమ్ తో కలిసున్న ఫొటోలను షేర్ చేసి, తమ మధ్య బంధాన్ని రివీల్ చేసింది మంజిమా.
అయితే తన ఇన్‌స్టాలో ఇదివరకు షేర్ చేసిన అన్ని పోస్టుల్నీ ఆమె డిలీట్ చేయడంతో ఆమె ఫాలోయర్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆమె ఇన్‌స్టా హ్యాండిల్లో ఇప్పుడు మూడంటే మూడు పోస్టులున్నాయి. వాటితో పాటు కొన్ని ఇన్‌స్టా స్టోరీస్‌ని మాత్రమే ఆమె ఉంచింది.
ఈ నెల 28న మంజిమా, గౌతమ్ పెళ్లాడబోతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో తన ఇన్‌స్టా పోస్టులను మంజిమా డిలీట్ చేయడం వార్తల్లో నిలిచింది. ఆమె ఎందుకు ఇలా చేసింది?.. ఇదే విషయాన్ని ఒక నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు. దానికి సమాధానంగా, "మనుషులతో అనుసంధానం కావడానికి ఇన్‌స్టాగ్రాం ఒక గొప్ప చోటని నాకు అర్థమైంది. అది ఎంత సుందరంగా కనిపిస్తుందనే గురించి నాకు వర్రీ లేదు. కాబట్టి నా పిక్చర్స్ చాలావాటిని ఆర్కైవ్స్ చేశా. మళ్లీ నా ప్రయాణం మొదలుపెట్టా" అని చెప్పింది మంజిమా.
కాగా చెన్నైలో తమ పెళ్లి నవంబర్ 28న జరుగుతుందని విరివిగా ప్రచారం జరుగుతున్నా.. ఆ ఇద్దరూ ఇంతదాకా దానిని ధ్రువీకరించలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



