రోజా బర్త్ డే ఫంక్షన్ లో వర్ష
on Nov 18, 2022

జబర్దస్త్ జడ్జిగా అందరి మనస్సులో నిలిచిపోయిన మంత్రి రోజా రీసెంట్ గా తన 50వ పుట్టినరోజును ఫ్రెండ్స్ తో కలిసి సెలెబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తర్వాత ఇంట్లో తన ఫ్రెండ్స్ మధ్య బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫంక్షన్ లో జబర్దస్త్ వర్ష, సీరియల్ యాక్టర్ నటకుమారి సందడి చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన రోజాతో పాటు జబర్దస్త్ వర్ష కూడా వెళ్ళింది. ఇక మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ నుంచి రోజా వెళ్ళిపోయింది. ఇక వర్ష గురించి చెప్పక్కర్లేదు. ఇమ్ముతో కాసేపు గొడవ పడుతుంది. తర్వాత మళ్ళీ మేం కలిసిపోయామంటుంది. అలా జబర్దస్త్ లో ఉన్నంత కాలం రోజాతో వర్షకి మంచి బాండింగ్ అనేది ఉంది. రోజా కూడా వర్ష, ఇమ్ము జంటపై ఎప్పుడూ సరదా కామెంట్స్ చేసేది. ఆ బాండింగ్ తోనే ఇప్పుడు రోజాతో కలిసి వర్ష ఆమె బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఫుల్ ఎంజాయ్ చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



