శివరాత్రికి 'సార్' వస్తున్నాడు
on Nov 17, 2022

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం 'సార్'(తమిళ్ లో 'వాతి'). ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.
'సార్' చిత్రాన్ని మొదట డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. శివరాత్రి కానుకగా 2023 ఫిబ్రవరి 17న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలుపుతూ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. కొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది. అది వాలీబాల్ కోర్టులో జరిగే ఫైట్ సీన్ లోని స్టిల్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్ మొదటిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో ధనుష్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా జె.యువరాజ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



