చలపతిరావు భార్య ఎన్టీఆర్‌ను ఎందుకు నిలదీసింది?
on Dec 27, 2022

విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ విలన్ గా, కమెడియన్ గా తిరుగులేని పేరును సంపాదించి, తెలుగు సినిమాలలో సుదీర్ఘకాలం కొనసాగిన చలపతిరావు ఆ స్థాయికి వచ్చేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. తల్లిదండ్రులు చదువుకోమని చెప్తే చదువు అబ్బక సినిమా రంగంలోకి వచ్చారు. అప్పట్లో సినిమాల్లోకి రావాలంటే ఖచ్చితంగా నాటకాలు వేసి ఉండాలి. అలా చలపతిరావు వందలాది నాటకాలు వేసినప్పటికీ సినిమా అవకాశాలు అంత సులభంగా రాలేదు. చెన్నైలో ఆకలితో బస్టాండ్‌లో ఉన్న రోజులు... గది అద్దె కట్టలేక ఓనర్ కు భయపడి బస్ స్టేషన్ లో తలదాచుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సినిమా గూడచారి 116 ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చినప్పటికీ చలపతిరావు ప్రయాణం మొదట్లో అడపా దడప అవకాశాలు వచ్చినప్పటికీ తర్వాత అవి రావడం మానేశాయి.
అప్పటికే పెళ్లి చేసుకున్న చలపతిరావు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. 1500 రూపాయలు అద్దె చెల్లించే ఇంటి నుంచి 12 రూపాయలు మాత్రమే చెల్లించగలిగే చిన్న రేకుల షెడ్డులోకి మారాడు. చలపతిరావుకి ఇందుమతితో వివాహమైంది. కానీ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో కుటుంబం గడవడం కష్టమైంది. కనీసం స్టూడియోలకు వెళ్లేందుకు జేబులో పైసా కూడా లేకపోవడంతో ఆ రోజుల్లో ఇందుమతి ధైర్యం చేసి తన పుస్తెలతాడు అమ్మి ఆయన చేతిలో పెట్టింది. ఒకానొక దశలో సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇందుమతి సీనియర్ ఎన్టీఆర్‌ను నిలదీసింది. నా భర్తకు ఏం తక్కువ... శోభన్ బాబు కంటే అందంగా ఉంటాడు. ఎత్తుగా ఆజానుబాహుడిగా దర్శనమిస్తాడు. మీరు కచ్చితంగా అవకాశాలు ఇవ్వాల్సిందే అంటూ నిలదీసిందట.
ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ చలపతిరావును తన దగ్గరకు పిలిపించుకొని జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ప్రతి మగవాడి విజయం వెంట ఒక ఆడది ఉంటుంది. అది నీ విషయంలో మరింత బలంగా రుజువయింది అని చలపతిరావు భుజం తట్టారు. తర్వాత ఆయన నటించే అనేక సినిమాల్లో చలపతిరావుకి అవకాశం ఇచ్చారు. ఇక అప్పటినుండి చలపతిరావుకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. తాజాగా చలపతిరావు మరణించిన సందర్భంగా ఆయన కుమారుడు రవిబాబు మాట్లాడుతూ మా నాన్నకు మూడే మూడు అంటే ఇష్టం. అందులో ఒకటి స్వర్గీయ ఎన్టీఆర్.... రెండోది మంచి ఆహారం... మూడోది హాస్యం. మా నాన్న స్వర్గీయ ఎన్టీఆర్‌ను దేవుడిలా కొలిచేవారు అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



