పవన్ రేంజ్ ఇది...స్టార్లకే స్టార్‌గా వెలిగిపోతున్నాడు!
on Dec 27, 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని, క్రేజ్్‌ని యువ హీరోలు తమ సినిమాల్లో రిఫరెన్స్‌గా వాడుకుంటూ ఉంటారు. పవన్ తమ సినిమా వేడుకకి వస్తే చాలు.. తమ చిత్రాలు హౌస్‌ఫుల్స్ అవుతాయని, పవన్ నుంచి పాజిటివ్ మాట వస్తే తమ చిత్రాలు హిట్ అవుతాయని ఆశపడుతూ ఉంటారు. నితిన్ నుంచి ఎందరో ఇదే బాటలో నడుస్తూ ఉంటారు. ఇప్పటికీ ప్రతి శుక్రవారం విడుదల సినిమాలలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రిఫరెన్స్ లు, సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇన్ని రోజులు కేవలం యంగ్ హీరోలు మాత్రమే ఆయన క్రేజ్‌ను వాడుకోవడం చూశాం. కానీ ఇప్పుడు టాప్ స్టార్స్ కూడా ఆయనని తెగ వాడేస్తున్నారు.
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేర్ వీరయ్య', నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'వీరసింహారెడ్డి', తమిళస్టార్ దళపతి విజయ్ నటించిన 'వారసుడు'.. ఇందులో పోటీ పడుతున్నాయి. ఈ మూడు సినిమాల ప్రిరిలీజ్ ఈవెంట్లకు పవనే ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్టు తాజాగా వినిపిస్తున్న సమాచారం. 'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి వస్తాడని, చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' ఈవెంట్ కు బాలయ్య వస్తాడని ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని వార్తలు వస్తున్నాయి.
తమిళంలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్ 'వారిసు' చిత్రం తమిళ వెర్షన్ వేడుక చెన్నైలో కనీవిని ఎరుగని రీతిలో జరిగింది. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈ ఈవెంట్ గురించే మాట్లాడుకుంటోంది. త్వరలో జరగబోయే తెలుగు వర్షన్ 'వారసుడు' ప్రి రిలీజ్ ఈవెంట్‌ని కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయాలి అనుకుంటున్నాడు ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు. ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ముఖ్య అతిథిగా పిలవగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఆ తర్వాత బాలయ్య బాబు హీరోగా నటించిన 'వీరసింహారెడ్డి', మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' ప్రి రిలీజ్ ఈవెంట్లకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారని సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.
మరో వైపు ఏపీలో.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి తరుణంలో టిడిపి ముఖ్యనేత కూడా అయిన బాలయ్య బాబుకి చెందిన 'వీరసింహారెడ్డి' వేడుకకు జనసేన అధినేత పవన్ వస్తే రాజకీయంగా కూడా అది సంచలనం అవుతుంది. ఇప్పటికే ఆహాలోని 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికే2'కి పవన్ అతిథిగా రావడం ఖరారయింది. ఇప్పటికే దానికి సంబంధించిన షూట్ కూడా జరిగింది.
ఇంకో వైపు తన అన్నయ్య నటించిన 'వాల్తేరు వీరయ్య' వేడుకకు కూడా పవన్ ముఖ్య అతిథిగా వస్తాడని ప్రచారం జరుగుతోంది. అలాగే చిరు ఇక తన సేవలను విస్తరిస్తానని, సినిమాల నుంచి అన్ని విధాలుగా తనకి వచ్చే ఆదాయాన్ని సమాజం కోసం ఖర్చుపెడతానని అంటున్నారు. దీని ప్రకారం చిరు తన ఛారిటీ ద్వారా సేవలు అందిస్తూ, దాని వల్ల వచ్చే మంచి పేరును జనసేనకు చెందేలా చేస్తారని, జనసేనకు ఆయన అండదండలు అందిస్తూ, ఆ పార్టీకి సంబంధించిన ఓ మంచి పదవిని చేపట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలలోకి రావడం, ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఆయనకు ఇష్టం లేదని అంటున్నారు. మరి చూద్దాం.. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎన్ని విచిత్ర పరిణామాలు సంభవిస్తాయో...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



