ENGLISH | TELUGU  

పూజా హెగ్డే... ఐరన్ లెగ్ ఆఫ్ ది ఇయర్!?

on Dec 27, 2022

ముంబై కి చెందిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈమె తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఈమె కెరీర్ అనుకున్న స్థాయిలో ప్రారంభం కాలేదు. ఓ తమిళ చిత్రంలో నటించిన ఆమెకు నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ చిత్రంలో అవకాశం వచ్చింది. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ‘ముకుందా’ చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు ఎలాంటి గుర్తింపును తీసుకొని రాలేదు. ఆ తరువాత బాలీవుడ్ లో హృతిక్‌రోష‌న్ న‌టించిన భారీ చిత్రం ‘మొహంజ‌దారో’ మూవీలో న‌టిస్తే  ఈ చిత్రం దారుణంగా ప‌రాజ‌యం పాలయింది. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్- దిల్ రాజు -హరిశంకర్‌ల‌ కాంబినేషన్లో వచ్చిన ‘డీజే’ (దువ్వాడ జగన్నాథం)తో ఒక రేంజిలో పాపులర్ అయింది. ఓవర్ నైట్ స్టార్‌డం సొంతం చేసుకుంది. అందులో చేసిన  బికినీ షో ఆమెకు విపరీతమైన పాపులార్టీని తీసుకొచ్చింది.

ఇక రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’లో జిగేలురాణి అంటూ ఐటెం సాంగ్ చేసి తెలుగు జిగేల్ రాణిగా పేరు తెచ్చుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సాక్ష్యం, ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ, మహేష్ సరసన మహర్షి, వరుణ్ తేజ్‌తో  మరోసారి గద్దల కొండ గణేష్, హిందీలో హౌస్‌ఫుల్ 4,  అల్లు అర్జున్- త్రివిక్రమ్‌ల కాంబినేష‌న్‌లో  వచ్చిన అలా వైకుంఠపురం, అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ప్రభాస్‌తో రాధేశ్యామ్‌,  కోలీవుడ్ స్టార్ దళపతి విజ‌య్‌తో బీస్ట్‌,  చిరంజీవి- రామ్ చరణ్ లు కలిసిన నటించిన ఆచార్య చిత్రాల్లో నటించింది ఇక వెంకటేశ్- వ‌రుణ్‌తేజ్‌లు  నటించిన ఎఫ్ 3 చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో న‌ర్తించింది. 

ఇటీవ‌లే  బాలీవుడ్ లో సర్కస్ సినిమా చేసింది.  ఆమె ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న మహేష్ 28వ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోందని సమాచారం. అంటే ఒక విధంగా చూసుకుంటే ఆమెకు ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూడో చిత్రం అవుతుంది. సాధారణంగా ఆర్టిస్టులను రిపీట్ చేసే త్రివిక్రమ్ మొదటిసారిగా ఎన్టీఆర్ స‌ర‌స‌న  ఆమెకు అరవింద సమేత వీర రాఘవ అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా చేసిన అలా వైకుంఠపురంలో నటించింది. ప్రస్తుతం మహేష్ బాబు 28వ సినిమాకు రెడీ అవుతోంది. ఇక విషయానికి వస్తే సినీ పరిశ్రమ ఒక రంగుల ప్రపంచం. ఈరోజు ఉన్నట్టు రేపు అసలు ఉండదు.

ఇక్కడ సక్సెస్ ఉంటేనే విలువ. సక్సెస్ లేకపోతే మూలన పడేస్తారు. అదే సక్సెస్ ఉంటే మాత్రం బ్లాంక్ చెక్స్ ఇవ్వడానికి కూడా ఎవ‌రు వెనుకాడ‌రు.  ఇక వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో దూసుకుపోయిన పూజా హెగ్డే పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది... తెలుగుతో పాటు హిందీలో కూడా నిన్న‌టి దాకా ఓ ఊపు ఊపిన ఆమె ప్ర‌స్తుతం వ‌రుస  డిజాస్టర్ ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతోంది. మొదట్లో ఐరన్ లెగ్‌గా ఆ తర్వాత మరల గోల్డెన్ లెగ్‌ మారిన ఆమె త‌మ చిత్రంలో ఉంటే చాలు... తమ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ సెంటిమెంట్ గా భావించేవారు. కానీ  ఇప్పుడు మాత్రం అమ్మో ఆమె ఐరన్ లెగ్. ఆమెతో సినిమాలు చేస్తే రిస్క్ అనే పేరు తెచ్చేసుకుంది. ఆమె అడుగు పెట్టిన ప్ర‌తి చిత్రం భ‌స్మం అయిపోయింది.

ఏడాది ప్రారంభంలో పాన్ ఇండియా మూవీగా, ఇండియన్ టైటానిక్ గా విడుదలకు ముంద భారీ అంచనాలు నెల‌కొల్పిన ప్ర‌భాస్‌-పూజాహెగ్డేల రాధేశ్యామ్ పెద్ద డిజాస్ట‌ర్‌.  ఈ చిత్రానికి వ‌చ్చిన‌ నష్టాలు 200 కోట్లకు పై మాటే. ఇక తమిళంలో హిట్టు మీద హిట్ కొడుతూ నెంబర్ వన్ స్టార్‌గా  అవతరించిన దళపతి విజయ్ సక్సెస్ ఫుల్ కెరీర్‌కి  ఈమె  అడ్డుకట్ట వేసింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బీస్ట్‌ చిత్రం తమిళనాడులో కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ఆచార్య చిత్రం కూడా ఎంత పెద్ద డిజాస్టర్ గా మిగిలిందో మనకి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- కొరటాల శివ వంటి పెద్ద కాంబినేషన్లో రూపొందిన ఆచార్య చిత్రం పూజా హెగ్డే లెగ్ పడటంతో దాని కింద పడి ఈ ముగ్గురు నలిగిపోయారు. ఈ  సినిమాకు కనీసపు వ‌సూళ్లు  కూడా రాలేదు.

ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ లో క్రేజీ మూవీ ని కూడా ఈమె మట్టి క‌రిపించేసింది బాలీవుడ్లో క్రేజ్ ఉన్న ర‌ణ‌వీర్‌సింగ్ తో కలిసి సర్కస్ అనే సినిమా చేసింది. రోహిత్ శెట్టి చిత్రానికి దర్శకుడు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అపజయం అనేది ఎరుగని రోహిత్ శెట్టికి ఏకంగా డిజాస్టర్ ప్లాప్‌ ఇచ్చింది. ఇలా వరుసగా ఫ్లాప్స్‌ రావడంతో పూజా హెగ్డే పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు... చూడాలి మరి భవిష్యత్తులో ఆమె మరలా గోల్డెన్ లెగ్‌గా మారుతుందా?  త‌న‌ ఐరన్ లెగ్ ను మ‌రోసారి గోల్డెన్ లెగ్ గా మార్చుకుంటుందా లేదా అనేది కాలమే తేల్చి చెప్పాలి!

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.