అనసూయ పక్కన అతనెవరో...
on Oct 26, 2022

అనసూయ అమెరికాలో దీపావళి సెలెబ్రేషన్స్ చేసుకుంది. ఇక ఇప్పుడు అనసూయ టెక్సాస్ లో ఎంజాయ్ చేస్తోంది. ఐతే అనసూయ ఒక అబ్బాయితో కలిసి దిగిన ఫోటో తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టేసరికి ఎవరా అబ్బాయి అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అతని పేరు ఉజ్వల్ కస్తాల. అనసూయ అతనితో కలిసి సెల్ఫీ దిగింది. ఇక అనసూయ అమెరికాలో ఉజ్వల్ ని కలిసి బర్త్ డే విషెస్ చెప్పారు. అనసూయ పక్కన ఉన్న ఉజ్వల్ ఎవరబ్బా అని ఆరా తీసేసరికి చాలా విషయాలు బయట పడ్డాయి. ఉజ్వల్ ఒక యాక్టర్ అని అలాగే అడివి శేష్ డైరెక్షన్ లో 2013లో వచ్చిన 'కిస్' అనే మూవీలో నటించాడని తెలుస్తోంది.
ఇలా ఉజ్వల్ ని దగ్గరగా చూసేసరికి అతను అనసూయకు మంచి ఫ్రెండ్ అని అర్ధమవుతోంది. ఇక అతని బర్త్డే సెలెబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తోంది. "మై గార్డియన్, మై ఫ్రెండ్ , మై టామ్ అండ్ జెర్రీ..హ్యాపీ బర్త్డే" అని విషెస్ చెప్పింది అనసూయ. అనసూయ ఈమధ్య కాలంలో క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటోంది. ఆమె నటించిన ఖిలాడి, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ మూవీస్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి . పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. అలాగే కొన్ని వెబ్ సిరీస్ కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



