'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలయ్య!
on Oct 26, 2022

నందమూరి, అల్లు కుటుంబాల మధ్య అనుబంధం రోజురోజుకి బలపడుతోంది. అప్పట్లో ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య మధ్య మంచి అనుబంధం ఉండేది. ఇక కొంతకాలంగా నందమూరి బాలకృష్ణతో అల్లు కుటుంబం సాన్నిహిత్యం కొనసాగిస్తున్న తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అల్లు అరవింద్ కి చెందిన ఓటీటీ వేదిక 'ఆహా'లో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' అనే షోకి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ప్రసారమైన మొదటి సీజన్ నుంచే బాలయ్యతో అల్లు అనుబంధం గురించి అందరికి తెలిసింది. అదే సమయంలో బాలయ్య నటించిన 'అఖండ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా రావడంతో పాటు, తన చిత్రం 'పుష్ప:ది రైజ్' విడుదలయ్యాక 'అన్ స్టాపబుల్' షోలో పాల్గొని బాలయ్యతో కలిసి సందడి చేశాడు. ఇదిలా ఉంటే అప్పుడు బాలయ్య సినిమా వేడుకకి బన్నీ గెస్ట్ గా రాగా, ఇప్పుడు అల్లు శిరీష్ సినిమా వేడుకకి బాలయ్య రాబోతున్నాడు.
శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. జీఏ2 పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 30న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా బాలయ్య హాజరు కానుండటం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



