ప్రభాస్ కోసం రానా ఇచ్చిన పెళ్లి సంబంధం ప్రకటన మరోసారి!
on Oct 23, 2020
ప్రభాస్.. ఈ పేరుకున్న వైబ్రేషన్స్ ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటితో అతను 41 సంవత్సరాల వాడయ్యాడు. అయినా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్‌ను అతనింకా అంటిపెట్టుకొనే ఉన్నాడు. ప్రభాస్ కెరీర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. 'బాహుబలి'కి ముందు, తర్వాత అని చెప్పుకుంటామని మనకు తెలుసు. మెగాస్టార్లు, పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు అందుకోలేని రేంజికి ఎదిగిపోయాడు ఈ డార్లింగ్ స్టార్. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్‌కున్న క్రేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మరే హీరోకూ లేదు. సౌత్, నార్త్ తేడా లేకుండా అందరికీ డార్లింగ్ అయ్యాడు.
ఇప్పటికీ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడనేది ఒక మిస్టరీగానే ఉంది. ఎప్పుడడిగినా తన డ్రీమ్ గాళ్ ఇంకా కనిపించలేదని చెప్పుకుంటూ వస్తున్నాడు. అతని పెదనాన్న కృష్ణంరాజు అయితే ఐదారేళ్ల నుంచీ ఈ సంవత్సరం ప్రభాస్‌కు పెళ్లి చేసేద్దామనుకుంటున్నాం అని చెప్తున్నారే కానీ, అది జరగడం లేదు. నాలుగేళ్ల క్రితం అతను భీమవరంకు చెందిన బీటెక్ చదివిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. తర్వాత అది కేవలం వదంతి అని తేలిపోయింది.
ప్రభాస్ పెళ్లి అనేది ఒక సమస్యగా మారిపోవడంతో బాహుబలిలో అతని విలన్‌గా నటించిన రానా 2016లో సరదాగా ఒక పెళ్లి సంబంధాల ప్రకటన ఇచ్చిన విషయం మరోసారి గుర్తు చేసుకుందాం. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక హిలేరియస్ మ్యాట్రిమోనియల్ యాడ్‌ను అతను షేర్ చేశాడు. అందులో ప్రభాస్ గుణగణాలు, అతని క్వాలిటీలు వెల్లడించిన రానా, పెళ్లికుమార్తెకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో పేర్కొన్నాడు. అప్పట్లో ఆ యాడ్ వైరల్‌గా మారింది.
Also Read