ENGLISH | TELUGU  

భీమ్ ఇంట్రో టీజ‌ర్‌.. రాజమౌళిపై కాపీక్యాట్ ట్రోలింగ్ తగ్గడం లేదుగా!

on Oct 23, 2020

 

'ఆర్ఆర్ఆర్' నుండి ఎన్టీఆర్ టీజర్ ఇలా విడుదలైందో లేదో.. అలా రాజమౌళి మీద ట్రోలింగ్ మొదలైంది. కాపీ క్యాట్ అంటూ కొందరు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి... టీజర్ లో ఎన్టీఆర్ ను గోండు బెబ్బులిగా చూపించిన తీరుకి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కానీ, కొన్ని షాట్లు రాజమౌళి కాపీ కొట్టడం మీదనే ట్రోలింగ్ మొదలైంది. ఏ షాట్ ఎక్కడ నుండి కాపీ కొట్టాడో ఆధారాలతో సహా షాట్ టు షాట్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండటంతో జక్కన్న వీరాభిమానులు డిఫెన్స్ లో పడ్డారు.

'రామరాజు ఫర్ భీమ్' పేరుతో 'ఆర్ఆర్ఆర్: రౌద్రం ర‌ణం రుధిరం' సినిమా నుండి విడుదలైన భీమ్ ఇంట్రో వీడియో (ఎన్టీఆర్ టీజర్) గమనిస్తే.... 0.09 మినిట్స్ దగ్గర ఒక అడవి కనిపిస్తుంది. స్లోవేనియా బేస్డ్ కంపెనీ 'adria mobile' 2019 ఆగస్ట్‌లో ఒక కేర‌వాన్‌ యాడ్ రూపొందించింది. ఆ వీడియోలో సేమ్ టు సేమ్ అటువంటి షాట్ ఒకటి ఉంది. ఆ తరువాత 0.11 మినిట్స్ దగ్గర వర్షం బిందువులు పడుతున్న షాట్ ఒకటి ఉంటుంది. పలు హాలీవుడ్ సినిమాల్లో అటువంటి షాట్లు ఉన్నాయి.

ఇక, 0.42 మినిట్స్ దగ్గర 'చీకట్లను చీల్చే మండుటెండ' డైలాగ్ దగ్గర భారీ విస్ఫోటనాన్ని చూపించారు. అది అయితే సేమ్ టు సేమ్ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ 'వోల్క‌నోస్ 101' నుండి కాపీ అని కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి మీద ఈ విధమైన కాపీ ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. గతంలో 'మగధీర', 'ఈగ', 'బాహుబలి' విడుదలైన తరువాత కూడా వచ్చాయి. 1.32 మినిట్స్ నుండి కొన్ని ఫ్రేమ్స్ ఫ్రీజ్ చేసి కాపీ అనడం సబబు కాదని కొందరు అంటున్నారు. సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయమని చెబుతున్నారు. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.