ఓటిటి లో వార్ 2 రికార్డు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి దొరికిన ఆయుధం
on Oct 14, 2025

స్టార్ హీరోలు ఎన్టీఆర్(Ntr),హృతిక్ రోషన్(Hrithik Roshan)సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన మూవీ 'వార్ 2'(War 2)ఇండియా ఫస్ట్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కగా అగస్ట్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. మిక్స్డ్ టాక్ కి సైతం ఎదురెళ్లి 350 కోట్లరూపాయల దాకా వసూలు చేసి, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఆ ఇద్దరి హీరోల కట్ అవుట్స్ కి ఉన్న స్టామినాని తెలియచేసింది. ఈ నెల 9 నుంచి ఓటిటి వేదికగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి రాగా, సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్ 2 రికార్డు స్థాయిలో వ్యూస్ ని రాబట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఆ వార్తలు నిజమని తేలింది. ముంబై వేదికగా నడిచే ప్రముఖ మీడియా సంస్థ 'ఆర్మాక్స్'(ormax)రీసెంట్ గా అత్యధిక వీక్షణలు పొందిన సినిమాల జాబితాని విడుదల చేసింది. ఈ నెల 6 వ తేదీ నుంచి 12 వరకు వచ్చిన వీక్షణల ఆధారంగా జాబితాని ప్రకటించగా, 3 .5 మిలియన్ల వ్యూస్ తో వార్ 2 అగ్ర స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారకంగా ప్రకటించింది. వార్ 2 తొమ్మిదవ తేదీ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చినా కూడా, మూడు రోజుల వ్యూస్ నే సదరు సంస్థ వెల్లడి చేసింది. మరి మూడు రోజుల్లోనే వార్ 2 ఆ స్థాయిలో వ్యూస్ ని రాబట్టడం ఒక రికార్డు అని చెప్పవచ్చు.
ఇక గత కొన్ని రోజులుగా బాలీవుడ్ కి చెందిన కొంత మంది సినీ విమర్శకులు వార్ 2 పరాజయం చెందిందని, దీంతో హృతిక్, ఎన్టీఆర్, కియారా అద్వానీ, దర్శకుడు అయాన్ ముఖర్జీ(Ayan Mukerji)ల పని బాలీవుడ్ లో అయిపోయినట్లే అనే కామెంట్స్ చేస్తు వస్తున్నారు. అభిమానులు కూడా సదరు విమర్శకులకి తమదైన స్టయిల్లో సమాధానం చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆర్మాక్స్ మీడియా వెల్లడి చేసిన న్యూస్ ఒక ఆయుధంలాగా దొరికిందని చెప్పవచ్చు. ఆర్మాక్స్ మీడియా గత పదిహేడు సంవత్సరాలుగా భారతీయచిత్ర పరిశ్రమకి, ప్రేక్షకులకి మధ్య వారధిగా పని చేస్తు వస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



