ఓజి ఓటిటి డేట్ ఇదేనా!
on Oct 14, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమానుల దాహాన్ని తీర్చిన చిత్రం 'ఓజి'(OG). గ్యాంగ్ స్టార్ గా పవన్ విజృంభించి నటించడం, దర్శకుడు సుజిత్(Sujeeth)ఇచ్చిన ఎలివేషన్, థమన్(Thaman)బ్యాక్ గ్రౌడ్ స్కోర్ అభిమానులని ఒక రేంజ్ లో మెస్మరైజ్ చేసింది. పైగా పవన్ కెరీర్ లోనే రికార్డు కలెక్షన్స్ ని సాధించిన చిత్రంగా కూడా ఓజి నిలవడంతో ఫ్యాన్స్ ఇప్పట్లో 'ఓజి' ని మర్చిపోయే అవకాశాలు చాలా తక్కువ.
ఇపుడు 'ఓజి' ఓటిటి సినీ ప్రియులని కూడా అలరించడానికి సిద్ధమవుతున్నట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు దీపావళి(Deepawali)కానుకగా అక్టోబర్ 23 నుంచి ఓటిటిలో సందడి చేయనున్నట్టుగా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి గాని, ఓజి హక్కులు పొందిన 'నెట్ ఫ్లిక్స్'(Netflix)నుంచి గాని ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఒక వేళ ఆ రూమరే నిజమయ్యి ఈ నెల 23 నుంచి ఓజి స్ట్రీమింగ్ అయితే మాత్రం ఓటిటి సినీ ప్రియులకి ఈ దీపావళి మరిన్ని వెలుగులు కురిపించడం ఖాయం.
ప్రస్థుతానికి అయితే థియేటర్స్ లో ఓజి సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతుంది. సెప్టెంబర్ 25 న పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్ గా విడుదలవ్వగా, ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయిల గ్రాస్ వరకు రాబట్టినట్టుగా తెలుస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



