సర్ ప్రైజ్ అంటూ సాంగ్ లీక్ చేసిన మెగాస్టార్!
on Dec 14, 2022

ఈరోజు సాయంత్రం మీ అందరితో ఒక సర్ ప్రైజ్ షేర్ చేసుకుంటాను అంటూ కాసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడంతో.. ఆ సర్ ప్రైజ్ ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే చిరంజీవి మాత్రం సర్ ప్రైజ్ అంటూ ఆయన కొత్త సినిమాలోని సాంగ్ ని లీక్ చేశారు.
చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'బాస్ పార్టీ' సాంగ్ ఆకట్టుకుంది. ఇక తాజాగా చిరంజీవి ఈ చిత్రంలోని రెండో సాంగ్ నుంచి కొంత భాగాన్ని లీక్ చేశారు.
చిరంజీవి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేశారు. అందులో తను, శృతి హాసన్ పై ఫ్రాన్స్ లో చిత్రీకరించిన సాంగ్ విశేషాలను పంచుకున్నారు. ఇక్కడ లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయని, అవి మీతో పంచుకోవడం కోసమే ఈ వీడియో చేశానని చెప్పారు. 8 డిగ్రీల చలిలో కూడా టీమ్ అంతా ఎంతో కష్టపడి పని చేసిందని తెలిపారు. ఇక చివరిలో కొంచెం సాంగ్ లీక్ చేస్తానంటూ.. ఒక లైన్ వినిపించారు. "నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవి అంట" అంటూ అంటూ ఆ సాంగ్ లిరిక్స్ సాగాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



