బిగ్ షాక్.. 'అవతార్-2'కి డివైడ్ టాక్!
on Dec 14, 2022
![]()
'అవతార్: ది వే ఆఫ్ వాటర్' విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న.. 52 వేల స్క్రీన్స్ లో భారీగా విడుదలవుతోంది. ఇప్పటిదాకా ప్రపంచ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రికార్డు 2009లో విడుదలైన 'అవతార్' పేరు మీద ఉంటే.. ఇప్పుడు ఆ రికార్డును అవతార్ సీక్వెల్ బ్రేక్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా 'అవతార్-2' డివైడ్ టాక్ సొంతం చేసుకోవడం సంచలనంగా మారింది.
వెండితెరపై దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన అద్భుతం 'అవతార్'(2009)ని అంతా తేలికగా మర్చిపోలేం. ఏకంగా 13 ఏళ్ళ తర్వాత ఆయన 'అవతార్-2'తో అలరించడానికి సిద్ధమయ్యాడు. దాదాపు 160 భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా కొన్ని చోట్ల క్రిటిక్స్, ప్రముఖుల కోసం ప్రత్యేక షోలను వేశారు. అయితే ఈ ప్రత్యేక షోలు చూసిన వాళ్ళ నుంచి 'అవతార్-2' కి సంబంధించి మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొందరు విజువల్ వండర్ అంటుండగా, మరికొందరు మాత్రం బోర్, ల్యాగ్ అంటున్నారు. సినిమా నిడివి బిగ్ మైనస్ గా మారిందనే అభిప్రాయం ప్రధానంగా వ్యక్తమవుతోంది. మరి 'అవతార్-2' అద్భుతాలు సృష్టిస్తుందో లేదో డిసెంబర్ 16న తేలిపోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



