ఆ సినిమాతో నా జీవితం తలకిందులైపోయింది!
on Dec 14, 2022

ఎన్నో మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన అలనాటి నటి ఝాన్సీ గురించి అందరికీ తెలుసు. ఒకప్పుడు స్టార్ హీరోస్ పక్కన చేస్తూ ఒక వెలుగు వెలిగిన నటి ఈమె. అప్పట్లో బాగా బతికినా ఈమె ఇప్పుడు ఆస్తులన్నీ పోయి అద్దె ఇంట్లో వుంటున్నారు. ఐతే చాలా కాలం తర్వాత ఆమె ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.
"ఇంతకుముందు మేము చెన్నైలో ఒక అద్దె ఇంట్లో 30 ఇయర్స్ అద్దెకు ఉన్నాం. ఆ తర్వాత హైదరాబాద్ ఫిలింనగర్ లో నాకు 700 గజాల స్థలం ఇచ్చారు. అలా ఇక్కడ ఇల్లు కట్టుకుని వచ్చేసాం. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఫిలిం ప్రొడక్షన్ చేయాలని అనుకున్నాం దానికి తగ్గట్టే సిద్ది వినాయక పిక్చర్స్ అనే బ్యానర్ పెట్టి సుమన్ తో "ఖైదీ ఇన్స్పెక్టర్" మూవీ తీసాం. ఈ మూవీకి డైరెక్టర్ బి.గోపాల్. మూవీ రిలీజ్ అయ్యింది కానీ మాకు డబ్బులేమీ రాలేదు..పోనీ తరువాత చూసుకుందాం అని డిస్ట్రిబ్యూషన్ కి కూడా ఇచ్చాం. కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇంటికి వచ్చి అందరం మంచినీళ్లు తాగేసి నిద్రపోయాం. నేను, మావారు సంపాదించింది మొత్తం ఈ మూవీ తీసి బాగా నష్టపోయాం. ఫిలిం నగర్‌లో ఇంటిని అమ్మేసి అప్పులు తీర్చాల్సి వచ్చింది."
"ఆ ఒక్క మూవీతో మా జీవితాలు తల్లకిందులైపోయాయి. నేనే ఎంతో మందికి సినిమా ప్రొడక్షన్ వైపు వెళ్లోద్దని చెప్పాను కానీ నేనే ఆ మోజులో పడిపోయాను. ఆ ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో మణికొండలో మరో ఇల్లు కట్టాను. అది ఫామిలీ సమస్యల వలన అమ్మేయాల్సి వచ్చింది. ఈ మూవీ లాస్ అవడానికి కారణం అప్పట్లో ఐదు నెలలు స్ట్రైక్ వచ్చింది. దానికి కారణం అప్పులు, జీతాలు, వడ్డీలు భారీగా పెరిగిపోయాయి. ఆర్ధికంగా చాలా నష్టపోయాం. ఆ దెబ్బ దెబ్బ బాబోయ్ ఇంకా సినిమా తియ్యకూడదు అని తెలిసింది" అంటూ తన జీవితంలో సినిమా పరంగా ఎదుర్కున్న కష్టనష్టాలు చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



