‘వాల్తేరు వీరయ్య’ ప్రీమియర్స్... మొదలైన హంగామా!
on Dec 13, 2022

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. కాగా ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కావడానికి దాదాపు 30 రోజులు టైం వున్నా సరే.. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌లో కూడా హంగామా మొదలు పెట్టారు. జనవరి 13 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండగా జనవరి 12న ‘వాల్తేరు వీరయ్య’ యూఎస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి. చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్ నటిస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఈ చిత్రంలోని ‘బాస్ పార్టీ’ అనే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు అటు మెగా ప్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్మూజిక్ అందిస్తుండగా మాస్ రాజా రవితేజ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలోని రవితేజ క్యారెక్టర్‌కు సంబందించి ఫస్ట్ లుక్ టీజర్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో ‘ఫస్ట్ టైమ్ ఒక మేక పిల్లను ఎత్తుకుని పులి వస్తా ఉన్నాది’ అనే డైలాగ్‌తో రవితేజ పాత్రను ఇంట్రడ్యూస్ చేశారు. ఓ చేతిలో మేకపిల్లను పట్టుకుని, మరో చేత్తో గొడ్డలితో గ్యాస్ సిలిండర్‌ను లాగుతూ స్టైలిష్ లుక్‌లో కనిపించి తన ఫ్యాన్స్‌కే కాకుండా మెగా ఫ్యాన్స్‌కి కూడా మంచి కిక్ ఇచ్చాడు రవితేజ. కాగా ఇదే సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘వీరసింహారెడ్డి’ కూడా రిలీజ్ అవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



