'వీరయ్య' కంటే 'వీరసింహా'నే ఎక్కువ!
on Dec 13, 2022
.webp)
ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి, 'వీరసింహా రెడ్డి'తో బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ కి దిగనున్నారు. ఈ రెండు సినిమాలనూ మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం. ఇటీవల ఈ సినిమాల ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రాల రన్ టైం కూడా లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 'వాల్తేరు వీరయ్య'తో పోలిస్తే 'వీరసింహా రెడ్డి' నిడివి 13 నిమిషాలు ఎక్కువని సమాచారం.
జనవరి 12న 'వీరసింహా రెడ్డి' విడుదల కానుండగా, జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' వస్తోంది. రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వడంతో ఇరు హీరోల ఫ్యాన్స్ అప్పుడే హంగామా మొదలుపెట్టారు. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఒక్కో సాంగ్ చిత్రీకరణ మినహా దాదాపు షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో రెండు చిత్రాల రన్ టైమ్ పై ఇప్పటికే క్లారిటీ వచ్చినట్లు సమాచారం. 'వాల్తేరు వీరయ్య' నిడివి 2 గంటల 30 నిమిషాలు కాగా, 'వీరసింహా రెడ్డి' నిడివి 2 గంటల 43 నిమిషాలు అని వినికిడి. మరి ఈ రెండిట్లో సంక్రాంతి పోరులో ఏ చిత్రం పైచేయి సాధిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



