'రామ బాణం'తో వస్తున్న గోపీచంద్!
on Dec 13, 2022

'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ ముచ్చటగా మూడోసారి జత కట్టిన సంగతి తెలిసిందే. గోపీచంద్ కెరీర్ లో 30వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షోలో ప్రభాస్ తో కలిసి గోపీచంద్ సందడి చేయనున్నాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. అయితే ఈ షోలో గోపీచంద్.. శ్రీవాస్ దర్శకత్వంలో చేస్తున్న తన తదుపరి సినిమా టైటిల్ ని రివీల్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి 'రామ బాణం' అనే టైటిల్ పెట్టినట్లు న్యూస్ వినిపిస్తోంది.
కెరీర్ లో ఎన్నో కమర్షియల్ విజయాలను అందుకున్న గోపీచంద్ కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. తనకు 'లక్ష్యం', 'లౌక్యం' వంటి విజయాలను అందించిన శ్రీవాస్ తో హ్యాట్రిక్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



