'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ డే కలెక్షన్స్.. మెగా ఓపెనింగ్స్ లోడింగ్!
on Jan 12, 2023

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీ మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన పక్కా మాస్ సినిమా కావడంతో.. సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ మెగాస్టార్ ని చూడటం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దానికితోడు మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటించడం అదనపు ఆకర్షణగా మారింది. అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చిరంజీవి గత చిత్రం 'గాడ్ ఫాదర్' పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. అది రీమేక్ సినిమా కావడం, మెగా మార్క్ మాస్ లేకపోవడంతో.. వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్ల లోపు షేర్ కే పరిమితమైంది. అయితే ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' పరిస్థితి వేరు. ఇది రీమేక్ ఫిల్మ్ కాదు. అందునా చాలా కాలానికి మెగాస్టార్ నుంచి వస్తున్న పక్కా కమర్షియల్ ఫిల్మ్. అందుకే ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మూడు కోట్ల గ్రాస్ దాటింది. యూఎస్ అడ్వాన్స్ ప్రీ సేల్స్ ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ దాటాయి. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ ఉంది. ఈ లెక్కన 'వాల్తేరు వీరయ్య'కి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చే అవకాశముందని, మొదటిరోజు రూ.25 కోట్ల వరకు షేర్ రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల 'ధమాకా'తో వంద కోట్ల క్లబ్ లో చేరి జోరు మీదున్న రవితేజ కీలక పాత్ర పోషించడం కూడా 'వాల్తేరు వీరయ్య'కు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. వెండితెరపై చిరంజీవితో కలిసి రవితేజ ఇచ్చే మాస్ ట్రీట్ చూడాలనే ఆసక్తి అందరిలో నెలకొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



