పవన్ ఫోన్ నెంబర్‌ను చిరు ఎలా సేవ్ చేసుకున్నాడో తెలుసా?
on Jan 12, 2023

చాలామంది ఇప్పుడు ఉన్న టాక్ షోలలో పెద్దపెద్ద హీరోలు హోస్ట్‌గా పని చేస్తే గాని తమకు, తమ టాక్ షోకి తిరుగే ఉండదని భావిస్తారు. కానీ సుమా, అలీలు చేసే టాక్ షోలు ఎంత బాగా ఉంటాయో అందరికీ తెలుసు. ఇక సుమ హోస్ట్ గా చేసిందంటే దాని స్టైలే వేరుగా ఉంటుంది. సుమాలోని హాస్య చతురత, సమయస్ఫూర్తి, సందర్భాచితంగా ప్రశ్నలు అడగడంలో ఆమెను మించిన వారు ప్రస్తుతానికి ఎవరు లేరు. ఇది కాస్త అతిశయోక్తి అనిపించినా ఇది వాస్తవం. కాగా ఇటీవల సుమా తన పేరు మీదనే సుమా అడ్డా అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన వాల్తేరు వీరయ్య యూనిట్ తో కలిసి సుమా అడ్డలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా సుమా అయనను ఫన్నీగా ఓ ప్రశ్న అడిగింది. మీరు మీ ఫోన్లో ఎవరెవరి పేర్లను ఎలా ఫీడ్ చేసుకుంటారు అనేది ఆ ప్రశ్న. దానికి చిరు సైతం అంతే హాస్య చతురతతో సమాధానం చెప్పారు. సురేఖ నెంబర్ను ఎలా సేవ్ చేసుకుంటారు అని సుమా అడిగితే రే అని చేసుకుంటాను అని చిరంజీవి సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత రామ్ చరణ్ నెంబర్ ని ఎలా సేవ్ చేసుకుంటారు అంటే చెర్రీ అని బదులిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ పేరును ఎలా సేవ్ చేసుకుంటారు అని అడగ్గానే ఆ షో ఆడిటోరియం మొత్తం అభిమానుల అరుపులతో దద్దరిల్లిపోయింది. దానికి సమాధానంగా చిరు పీకే అనో పవన్ కళ్యాణ్ అనో నేను సేవ్ చేసుకోను... కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకుంటాను... అని సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు కావడం గమనార్హం.
ఆయన సినీ రంగంలోకి కూడా కళ్యాణ్ బాబు పేరుతోనే ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తమ కుటుంబ కులదైవమైన ఆంజనేయ స్వామికి మరో పేరు అయినా పవన్ ను ముందు చేర్చారు. దాంతో కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ అయ్యారు. ఇక చిరు సైతం శివ శంకర్ వరప్రసాద్ అన్న పేరును ఆంజనేయ స్వామి మరోపేరైన చిరంజీవిగా తన పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతనే ఆయనకు కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసి వచ్చి మెగాస్టార్ అయ్యారు. ఆ కుటుంబంలో ఆంజనేయ స్వామి పేరు లేనిది ఒక నాగబాబుకు మాత్రమే. మిగతా వారందరూ స్క్రీన్ నేమ్ గా తమ పేర్లను ఆంజనేయస్వామికి అనుగుణంగా మార్చుకున్నప్పటికీ నాగబాబు మాత్రం నాగబాబు నాగేంద్రబాబు పేర్లతోనే అందరికీ పరిచయం. ఇప్పటికీ ఆయన పేరు నాగబాబే. ఇక వీరి తల్లి పేరు అంజనా దేవి కావడం గమనార్హం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



