సిగరెట్ వద్దు... చుట్ట ముద్దు అంటున్న బాలయ్య!
on Jan 12, 2023

సాధారణంగా సినిమాలలో హీరోలను స్టైలిష్ గా చూపించడానికి మాన్లీగా కనిపించడానికి సిగరెట్ తాగుతూ కనిపిస్తుంటారు. హీరోయిజం ఎలివేట్ చేయడం కోసం హీరోల చేత దర్శకులు సిగరెట్టు తాగిస్తుంటారు. కానీ బాలయ్య మాత్రం తన మెజార్టీ సినిమాలలో చుట్టలు కాలుస్తు కనిపించారు. ఎక్కువ శాతం బాలయ్య చుట్టలు కాల్చడమే సినిమాల్లో చూస్తాం. ఇక బాలయ్య నిజ జీవితంలో కూడా చుట్ట కాల్చుతారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. సినిమా డైలాగులు చెప్పే సమయంలో గొంతు గార రాకుండా ఉండాలి అంటే చుట్ట తాగాలని బాలయ్య చెప్తుంటారు. సీనియర్ ఎన్టీఆర్ కూడా ప్రతిరోజు ఉదయాన్నే చుట్టూ తాగేవారు. చుట్టతాగడం వలన వాయిస్ గంభీరంగా తయారవుతుందనేది నాడు ఎన్టీఆర్ చెప్పిన మాట.
నేడు బాలయ్య సైతం తండ్రి మాటనే చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు లేచి చుట్ట కాలుస్తాను. అది ఒక అలవాటుగా మారింది. చుట్ట కాల్చడం వల్ల వాయిస్ కు చాలా మంచిది. డ్రింక్ ను స్ట్రా వేసుకుని ఎలా తాగుతారో అలా చుట్టని తాగుతూ లోనికి పీల్చుకోవాలి. అప్పుడు ఆ పొగ లంగ్స్ వరకు వెళ్లి వాటిపై ఉన్న శ్లేష్మం ను బయటకు తీసుకొని వస్తుంది.... అని చెప్తున్నాడు బాలయ్య. సిగరెట్ పీల్చడం ఆరోగ్యానికి హానికరం. కానీ చుట్ట తాగడం వల్ల ఎక్కువ అనారోగ్యం కాదని బాలయ్య అభిప్రాయం.
దీనిని కొందరు తప్పు పడుతుంటే మరికొందరు చుట్ట తాగాలని, దాని వల్ల ఇంత ప్రయోజనం ఉందా? మేము కూడా అలవాటు చేసుకుంటే బాగుండు అనుకుంటున్నారట. నాటు పొగాకు చుట్టాలను ఎక్కువగా ఇంతకుముందు తాగేవారు. కానీ ఇప్పుడు పల్లెటూర్లలో పెద్ద మనుషులు కూడా సిగరెట్లు తాగుతున్నారు. కానీ బాలయ్య మాత్రం సాంప్రదాయ పద్ధతిలో నాటు పొగాకుతో తయారవుతున్న చుట్టాలను తాగడం కాస్త విడ్డూరంగానే ఉన్నా ఇది వాస్తవం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



